పుంజుకునే దశలో ఉన్న రియల్ ఎస్టేట్‌కు బంగారం దూకుడు సమస్యగా మారుతోంది. పెట్టుబడులు బంగారం, వెండి వైపు తరలి పోతున్నాయి. ఇళ్లు, స్థలాలపై పెట్టుబడులు పెడదామని ఆలోచించేవారు భవిష్యత్ ఎవరూ ఊహించనంతగా వెండి, బంగారం ధరలు పెరుగుతాయని అంచనాలతో అటు వైపు వెళ్తున్నారు. అందుకే ఆ రెండు మెటల్స్ లో పెట్టుబడులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. బంగారం కన్నా వెండిలో పెట్టుబడులు ఇంకా పెరుగుతున్నాయి.
గతంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మంచి రాబడులు ఇచ్చేవి. బంగారం కన్నా ఎక్కువగా ఉండేవి. కానీ ఈ ఏడాది 2025లో గోల్డ్ , సిల్వర్ పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతోంది. గోల్డ్ 50 శాతానికి పైగా పెరిగింది, సిల్వర్ కూడా బలంగా ఉంది. ట్రంప్ విధానాల వల్ల ప్రపంచంలో అనిశ్చితి, ఇన్ఫ్లేషన్ వంటివి ప్రధానంగామారాయి
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా సంక్షోభం ఏర్పడితే బంగారానికి డిమాండ్ పెరుగూతూ వస్తుంది. ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాలు లేదా మార్కెట్ క్రాష్ వంటి సమయాల్లో విలువ పెరుగుతుంది. డిజిటల్ గోల్డ్/సిల్వర్ సులభంగా కొనుగోలు/అమ్మకం చేయవచ్చు. స్టాక్స్‌తో పోలిస్తే తక్కువ కొరిలేషన్, పోర్ట్‌ఫోలియో రిస్క్ తగ్గిస్తుంది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంగా ఎదురు చూస్తూ ఉండాలి. హోమ్ లోన్ డిడక్షన్స్, లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ అదేమీ పెద్ద ప్లస్ పాయింట్లుగా చూడలేకపోతున్నారు .
రాబోయే రోజుల్లో గోల్డ్ , సిల్వర్ ఇలాగే పరుగులు పెడుతుందని నమ్మితే వచ్చే ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ లోకి రావాల్సిన పెట్టుబడుల్లో 30 నుంచి 40 శాతం బంగారం, వెండి వైపు వెళ్లినా ఆశ్చర్యం ఉండదని మార్కెట్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.