బెంగళూరులో ఎన్ని మౌలిక సదుపాయాల సమస్యలు ఉన్నా.. ఐటీ రంగం కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025లో మరింత వేగంగా వృద్ధి చెందుతోంది. ఐటీ బూమ్, పెరుగుతున్న ఆదాయ స్థాయిలు వంటి కారణాలతో మార్కెట్ వాల్యూ అనూహ్యంగా పెరుగుతోంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 3 , 3.5 బెడ్రూమ్ హాల్ కిచెన్ (BHK) యూనిట్లు అత్యంత పాపులర్ అవుతున్నాయి, వైట్‌ఫీల్డ్ , నార్త్ బెంగళూరు యలహంక వంటి ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోంది.
2025లో బెంగళూరు రెసిడెన్షియల్ మార్కెట్లో 3, 3.5 BHK కాన్ఫిగరేషన్లు డిమాండ్‌లో ఉన్నాయి, ముఖ్యంగా మిడ్-టు-ప్రీమియం సెగ్మెంట్లో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీ ప్రొఫెషనల్స్, ఫ్యామిలీలు, ఎన్ఆర్ఐలు ఈ యూనిట్లను ఎంచుకుంటున్నారు . అవి విశాలమైన లివింగ్ స్పేస్, మోడర్న్ అమెనిటీలు అందిస్తున్నాయి. సర్జాపూర్ రోడ్ వంటి ప్రాంతాల్లో 3 BHK ఫ్లాట్లు చేపడుతున్న ప్రాజెక్టుల్లో వెంటనే బుకింగ్ పూర్తవుతున్నాయి.
వైట్‌ఫీల్డ్ 2025లో బెంగళూరు రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా మారింది, ఐటీ పార్కులు , మెట్రో పర్పుల్ లైన్ ఎక్స్టెన్షన్ దీనికి కారణం. ఇక్కడ సగటు చదరపు అడుగు ధర రూ. 9,100 వరకూ ఉంటోంది. యలహంక, హెబ్బల్ లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఐటీ కారిడార్లు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మరింత ప్లస్ అవుతోంది. మార్కెట్ బూమ్ ఉన్నప్పటికీ, లిమిటెడ్ ల్యాండ్, పెరిగిన ధరల వల్ల .. అందుబాటు ఇళ్లు అనే కాన్సెప్ట్ కు బెంగళూరు రియల్ మార్కెట్ దూరం జరుగుతోది.