మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజున వేణుగోపాల్ అలియాస్ అభయ్ గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో అరవై మంది మావోయిస్టులు కూడా సరెండర్ అయ్యారు. మల్లోజుల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి అతి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సగం మంది క్యాడర్ పార్టీ నుంచి బయటకు వస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
పదేళ్ల కిందట ఎన్ కౌంటర్ లో చనిపోయిన అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావుకు ఈయన సోదరుడు. మావోయిస్టు పార్టీ గన్ డౌన్ చేస్తుందని ఇటీవల ఓ లేఖ కేంద్రానికి రాశారు. ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించారు. కానీ ఇతర మావోయిస్టు అగ్రనేతలు అదంతా ఆయన వ్యక్తిగతమని పార్టీ నిర్ణయం కాదని అన్నారు. మల్లోజులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని ఆయన ఆయుధాలతో సహా తమ ఎదుట లొంగిపోవాలని హెచ్చరించారు. దానికి ప్రతిగా మల్లోజుల ఓ లేఖ కూడా విడుదల చేశారు. ఆ గ్యాప్ అలా పెరిగిపోయింది.
ఇప్పుడు మల్లోజుల పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన ఇచ్చే సమాచారంతో మిగతా నక్సల్స్ అగ్రనేతలను కూడా తుదముట్టించి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్ రహిత దేశంగా ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రయత్నంలో మల్లోజుల లొంగుబాటు అతి పెద్ద విజయం అనుకోవచ్చంటున్నారు.