చిరంజీవి అనిల్ రావిపూడి మన శంకర వర ప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల ప్రోమో వైరల్ అయ్యింది. ఇప్పుడు లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. ఇది భార్య భర్తల మధ్య వచ్చే అలక సాంగ్.
మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్లా
పొద్దున లేచిన దగ్గర్నుంచి డైలీ యుద్ధాలా
మొగుడు పెళ్ళాలు అంటేనే కంకి కొడవళ్ళా
అట్టా కన్నెర్ర చేయాలా కారాలే నూరేలా
దుమ్మెత్తి పోయాలా దూరాలే పెంచేలా
కుందేలుకి కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టేలా.. ఇలా సాగింది భాస్కరభట్ల సాహిత్యం.
సాంగ్ లో చిరంజీవి గ్రేస్ కనిపించింది. డ్యాన్స్ మూవ్స్ కొన్ని వింటేజ్ చిరంజీవిని గుర్తు చేశాయి. చిరు నయన కెమిస్ట్రీ కూడా కుదిరింది. ఉదిత్ నారాయణ్ వాయిస్ పాటకు పప్రత్యేక ఆకర్షణ. భార్య భర్తల మధ్య అలక యూనివర్శల్ ఎమోషన్. ఇలాంటి వైబ్ సంక్రాంతికి ప్లస్ అవుతుంది. అనిల్ రావిపూడి సరైర ట్రాక్ లోనే సినిమాని రెడీ చేస్తున్నాడని ఈ సాంగ్ చూస్తే అర్ధమౌతుంది.