పదేళ్లలో విశాఖ రియల్ ఎస్టేట్ ముంబైతో పోటీ పడేలా అభివృద్ధి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ రంగంలో వస్తున్న భారీ పెట్టుబడులు, భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ నగరాన్ని భారతదేశంలోని ప్రముఖ ఐటీ మరియు ఆర్థిక హబ్‌గా మార్చనున్నాయి.
ప్రస్తుతం గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు వైజాగ్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. సుమారు $15 బిలియన్లు పెట్టుబడితో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది. ఇది రాబోయే 5 ఏళ్లలో పూర్తవుతుంది. అదే సమయంలో ఇతర పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ వంటివి ఇప్పటికే పెట్టుబడులను ప్రకటించాయి.2035 నాటికి ఈ పెట్టుబడులు వైజాగ్‌ను ‘ఐటీ సిటీ’గా మార్చుతాయి. లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. హై శాలరీ ఉద్యోగాల కారణంగా రెసిడెన్షియల్ , కమర్షియల్ ప్రాపర్టీల డిమాండ్ ఆకాశాన్ని తాకుతుంది.
ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.5,000-10,000 మధ్య ఉన్న ధరలు 2035 నాటికి రూ.20 వేలు దాటిపోతాయని అంచనా. ఐటీ పార్కుల చుట్టూ స్మార్ట్ సిటీలు, లగ్జరీ అపార్ట్మెంట్లు, ఆఫీస్ స్పేస్‌లు విస్తరిస్తాయి. ఇది రిటైల్, లాజిస్టిక్స్, డేటా సెంటర్ల వంటి ఇతర రంగాలకు కూడా విస్తరిస్తుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 జూన్ నాటికి ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్‌పోర్టు విజాగ్‌ను గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా మారుస్తుంది. టూరిజం, బిజినెస్ ట్రావెల్ పెరుగుతాయి, ఇది హోటల్స్, రిటైల్ స్పేస్‌ల డిమాండ్‌ను పెంచుతుంది.
ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల రూరల్ ఏరియాలు అర్బన్ గ్రోత్ జోన్లుగా మారతాయి. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు సమీపంలోని భూమి ధరలు వేగంగా పెరుగుతున్నాయి మరియు 2035 నాటికి ఇవి డబుల్ అవుతాయి. రోడ్లు, మెట్రో ప్రాజెక్టులు, స్మార్ట్ సిటీ ఇనిషియేటివ్‌లు ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా మారుస్తాయి. వైజాగ్ 2035లో భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా మారుతుందని నిపుణులు తేలుస్తున్నారు.