దీపావళికి మిత్రమండలి, కె రాంప్, తెలుసు కదా, డ్యూడ్ సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఈ సినిమాల కంటెంట్ మాట పక్కన పెడితే సినిమా ప్రమోషన్స్ లో మాటలతో వేడెక్కించారు హీరో నిర్మాతలు.
కె రాంప్ నిర్మాత రాజేష్ తొడకొట్టి మరి సినిమా గురించి ప్రచారం చేశారు. మిత్రమండలి బన్నీ వాసు తనని ఎవరు ఏమి చేయలేరు అన్నట్టుగా ఒక పరుష పదజాలాన్ని వాడి హీటెక్కించారు. తెలుసు కదా విషయానికొస్తే హీరో సిద్దు జొన్నలగడ్డ మీడియా వైఖరిని ఎండగట్టాడు. డ్యూడ్ విషయానికి వస్తే హీరో మెటీరియల్ అనే మాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ నాలుగు సినిమాలు కంటెంట్ తో పాటు ప్రమోషన్స్ లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే మాటల్లో కూడా దీపావళి టపాసులు అనే కనిపించారు. ఈ నాలుగు సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. మరి దీపావళి రేసులో ఏ సినిమా గట్టిగా పేలుతుందో చూడాలి.