ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం ఆచూకీ లేకుండా చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. ‘ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్’ ద్వారా ప్రతి మద్యం బాటిల్‌పై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నిజమైనదా కాదా నిర్ధారణ చేసిన తర్వాతనే అమ్మాల్సి ఉంటుంది. మద్యం షాపుల్లో వినియోగదారునికి ఇచ్చే ముందు బాటిళ్లను స్కాన్ చేయడం తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు.
ఈ నిబంధనలు అక్టోబర్ 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అమలు చేస్తున్నారు. ప్రతి మద్యం బాటిల్‌పై జియో-ట్యాగ్ చేసిన క్యూఆర్ కోడ్ ఉంటుంది. షాపుల్లో సేల్ చేసే ముందు ఈ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఇది బాటిల్ డిస్ట్రిబ్యూషన్, ఆరిజిన్, డెస్టినేషన్ వివరాలు చూపిస్తుంది. జియో-ట్యాగింగ్ వల్ల బాటిళ్లు నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే అమ్ముతారు. బెల్ట్ షాపులకు వెళ్లడం ఉండదు.
వినియోగదారులు ‘ఏపీ ఎక్సైజ్ సురక్షా’ యాప్‌ను డౌన్లోడ్ చేసి, బాటిల్‌పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు. మద్యం షాపుల లైసెన్స్ హోల్డర్లు స్కానింగ్ ప్రక్రియను అనుసరించకపోతే, లైసెన్స్ రద్దు, జరిమానాలు విధిస్తారు. ఇది రాష్ట్రంలోని 3,500కు పైగా మద్యం షాపులకు వర్తిస్తుంది. డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను కూడా ఇంటిగ్రేట్ చేశారు. షాపుల్లో UPI/QR కోడ్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు, కానీ ఇది క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో సంబంధం లేదు.