జగన్ మోహన్ రెడ్డి కోర్టుల్ని టేకిట్ గ్రాంటెడ్‌గా తీసుకున్న తీసుకున్న వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఆయన విదేశీ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని సీబీఐ కోర్టులో తాజాగా సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి కారణం ఆయన తన ఫోన్ నెంబర్ ను ఇవ్వకపోవడమే. అసలు తన నెంబర్ ఇవ్వకుండా ఎవరిదో నెంబర్ ఇచ్చి తన దారిన తాను యూరప్ వెళ్లిపోయారు.
విదేశీ పర్యటనకు కోర్టు అనుమతిస్తూ విధించిన షరతుల్లో జగన్మోహన్ రెడ్డి తన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇవ్వాలని స్పష్టంగా ఉంది. జగన్ తనకు తోచిన ఓ నెంబర్ ను ఇచ్చిపోయారు. అది ఆయన నెంబర్ కాదు. ఆయన ఎక్కడకు వెళ్లారో ట్రేసే చేసే ప్రయత్నంలో ఇది బయటపడినట్లుగా ఉంది. వెంటనే సీబీఐ ఈ విషయాన్ని కోర్టుదృష్టికి తీసుకెళ్లింది. ఆయన షరతులు ఉల్లంఘించారని ఉన్న పళంగా ఆయన అనుమతిని రద్దు చేయాలని కోరింది.
ఈ అంశంపై కోర్టు జగన్ న్యాయవాదికి నోటీసులు జారీ చేసింది. గురువారం ఈ పిటిషన్ పై విచారణ జరిపే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి కోర్టుల్ని అసలు లెక్కలోకి తీసుకుంటున్న పరిస్థితులు కనిపించడం లేదు. ఆయన విచారణకు హాజరు కారు.. షరతులూ పట్టించుకోరు. అసలు ఆయన యూరప్ కు ఏ కారణంతో వెళ్లారో.. అక్కడే పనులు చక్కబెడుతున్నారో అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. దర్యాప్తు సంస్థకు అందకుండా .. తన అనుపానులు తెలియకుండా ఆయన జాగ్రత్తపడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.