అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం జరిగినా సరే అమెరికా అధ్యక్ష పీఠాన్ని వదులుకునేలా లేరు. ఆయన మరోసారి అధ్యక్షుడు కావడానికి అమెరికాను అల్లకల్లోలం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.తాను కింగునేనని ఆయన చేసుకుంటున్న ప్రచారంతో పాటు 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా ఆయన సంకేతాలు ఇస్తున్నారు.కానీ అది ఎలా సాధ్యమన్నది మాత్రం చెప్పడంలేదు.
కింగ్ ట్రంప్ – అలా వదిలేయరు.. !
మూడోసారి ఎన్నిక పోటీ చేయడానికి అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణను మార్చాలని లేదా రద్దు చేయాలని ప్రణాళికలు ట్రంప్ వేస్తున్నారు. ట్రంప్ కొన్ని ఇంటర్వ్యూల్లో మూడో టర్మ్ గురించి “మెథడ్స్” ఉన్నాయని చెప్పారు. అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణను 1951లో ఆమోదించారు. ఈ సవరణ ప్రకారం, ఎట్టి అధ్యక్షుడైనా రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ వరుసగా నాలుగు సార్లు ధ్యక్షుడు అయిన తర్వాత ఈ చట్టం చేశారు.
మూడోసారి ట్రంప్‌కు చాన్స్ లేదు కానీ వదలరు !
ట్రంప్ ఇప్పటికే రెండుసార్లు అధ్యక్షుడిగా ఎనికయ్యారు. కాబట్టి, 2028లో మళ్లీ పోటీ చేయడం చట్టవిరుద్ధం . వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ అధ్యక్ష పదవిలో గెలిచి 2 రెజిగ్న్ చేసి ట్రంప్‌కు ఛాన్స్ ఇవ్వడం వంటివి ఉన్నాయి. టెన్నెస్సీ GOP రిప్రజెంటేటివ్ ఆండీ ఓగ్లెస్ 2025 జనవరి 23న హౌస్ రిజల్యూషన్ ప్రవేశపెట్టారు. ఇది 22వ సవరణను మార్చి, నాన్-కన్సిక్యూటివ్ టర్మ్‌లు ఉన్న అధ్యక్షులు మూడోసారి పోటీ చేయవచ్చు అని బిల్లలులో ప్రతిపాదించారు.
కావాలంటే కిమ్ లా మారేందుకూ వెనుకాడరు !
రాజ్యాంగ సవరణకు కాంగ్రెస్ హౌస్ , సెనెట్‌లో 2/3 మెజారిటీ కావాలి. ప్రస్తుతం ట్రంప్‌కు స్లిమ్ మెజారిటీ మాత్రమే ఉంది. తర్వాత 38 రాష్ట్రాలు రాటిఫై చేయాలి. లీగల్ ఎక్స్పర్టుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ మూడోసారి పోటీ చేయడం అసాధ్యం. వైస్ ప్రెసిడెంట్ ద్వారా అడ్డదారిలో రావాలనుకుంటున్నా కూడా 12వ సవరణ వల్ల ఫెయిల్ అవుతాయని చెబుతున్నారు. కానీ ట్రంప్ ఇలా రాజ్యాంగాన్ని పాటించేస్తారని ఎవరూ అనుకోలేరు. ఆయన ఎన్నికలు దగ్గర పడే కొద్దీ చేసే రాజకీయం అమెరికాను వణికించడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. కావాలంటే కిమ్నూ ఆయన ఆదర్శంగా తీసుకునేందుకు వెనుకాడరు.