శర్వానంద్‌కు డీసెంట్ ఇమేజ్ వుంది. కామెడీ, ఫ్యామిలీ, లవ్ స్టోరీలకు బాగా యాప్ట్. అయితే కొంతకాలంగా తనకు విజయాలు లేవు. ఎలాగైనా సరే… ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు తన ఖాతాలో రెండు సినిమాలు ఉన్నాయి. ‘నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతికి విడుదల అవుతోంది. అది కాకుండా యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రానికి ‘బైకర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథ ఇది. శర్వా బైక్ రేసర్‌గా కనిపించబోతున్నాడు. దానికి తగ్గట్టుగా ఈ టైటిల్ సెట్ చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అందులో శర్వా మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు.
మరోవైపు శ్రీనువైట్ల దర్శకత్వంలో శర్వా ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముందు ఈ కథ నితిన్ దగ్గరకు వెళ్లింది. నితిన్ తో దాదాపు ఫిక్స్ అయినట్టు చెప్పుకొచ్చారు. అయితే చివరికి శర్వానంద్ ఓకే చెప్పినట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ కూడా త్వరలో రాబోతోందని సమాచారం. శ్రీనువైట్ల కూడా విజయాల కోసం చాలా కాలం నుంచి అన్వేషిస్తున్నారు. కొత్త కొత్త జోనర్లు ప్రయత్నిస్తున్నారు. కానీ వర్కవుట్ కావడం లేదు. ఈసారి తనదైన కామెడీ ఎంటర్టైనర్ సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా శర్వా లా యేడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే యంగ్ హీరోలు విజయాలకు దూరంగా ఉండకూడదు. ఎలాగోలా హిట్ బాట పట్టాల్సిందే. ఈదఫా అయినా శర్వా విజయాల బాట పడతాడేమో చూడాలి.