బీహార్లో ఎన్డీఏ తరపున ప్రచారం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియా సంస్థలకు ఇంటర్యూ ఇచ్చారు. ఈ క్రమంలో మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గత పాతికేళ్లుగా ఓటమి అనేది లేకుండా గెలుస్తూనే ఉన్నారని ప్రశంసించారు. ఈ దశాబ్దం మోదీదేనని అంటే ఇండియాదేనని స్పష్టం చేశారు.
బీహార్ లోనూ ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధిస్తుందని.. తాను కూడా ప్రచారం చేస్తానని తెలిపారు. మోదీ పరిపాలనలో దేశం వేగంగా ముందుకెళ్తోందని అన్నారు. జీఎస్టీని సంస్కరణలపైనా ప్రధానంగా చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజల వద్ద డబ్బులు మిగులుతున్నాయని .. ఇది వారి జీవన ప్రమాణాలను పెంచుతుందని చెబుతున్నారు.
ఉత్తరాదిన కూడా చంద్రబాబుకు మంచి గుర్తింపు ఉంది. ఆయన పనితీరుపై అక్కడ నేతలతో పోల్చి చూస్తూ ఉంటారు. ఎన్డీఏ నేతలందరితో కలిసి ప్రచార కార్యక్రమాలను బీజేపీ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ కూడా ఖరారు అయి ఉంటుందని భావిస్తున్నారు.
