ఇంటి నిర్మాణం స్మార్ట్ టెక్నాలజీలతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. AI-డ్రివెన్ క్లైమేట్ కంట్రోల్, లైటింగ్, సెక్యూరిటీ సిస్టమ్స్ వాయిస్-కంట్రోల్డ్ అప్లయన్సెస్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈ సిస్టమ్స్ ఎనర్జీ సేవింగ్, సౌకర్యం , సెక్యూరిటీని మెరుగుపరుస్తున్నాయి. హైదరాబాద్ వంటి మెట్రోలలో ఈ ట్రెండ్ వేగం పుంజుకుంటోంది.
ఇప్పుడు ఇళ్లలో సకల సౌకర్యాలు కోరుకుంటున్నారు. స్మార్ట్ హబ్‌లుగా ఉండాలని అనుకుంటున్నారు. AI సిస్టమ్స్ యూజర్ ప్రవర్తనలు విశ్లేషించుకుని ఆటోమేటెడ్‌గా అడ్జస్ట్ అవుతాయి. 2025లో నిర్మితం అవుతున్న లగ్జరీ ఇళ్లలో 75% కొత్త ఇళ్లలో స్మార్ట్ ఆటోమేషన్ ఉంటాయని అంచనా ఇండస్ట్రీ అంచనా వేస్తోంది.
వెదర్, ఆక్యుపెన్సీ బట్టి HVAC సిస్టమ్స్ ఆప్టిమైజ్. ప్రెడిక్టివ్ అడ్జస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. యూజర్ బిహేవియర్ బట్టి బ్రైట్నెస్, కలర్ అడ్జస్ట్. సర్కాడియన్ రిథమ్ లైటింగ్ స్టాండర్డ్ మారుతుంది. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో హ్యాండ్స్-ఫ్రీ ఆపరేషన్. 60% స్మార్ట్ డివైసెస్ వాయిస్-ఆక్టివేటెడ్ గా మారుతున్నాయి.
ఈ సిస్టమ్స్ మాటర్ స్టాండర్డ్‌తో ఇంటర్కనెక్టెడ్గా మారాయి, ఒకే యాప్‌తో కంట్రోల్ చేయవచ్చు. బిల్డర్లు ఈ టెక్నాలజీలను ఇంటిగ్రేట్ చేయడం తప్పనిసరి అయింది. మిలీనియల్స్ వీటిని చూసిన తరవాత కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఇవీ తక్కువ ఖర్చుతో అయ్యేవి కాదు. చాలా ఖర్చు అవుతుంది. అయినా కొత్త తరం ఇళ్ల కొనుగోలుదారులు వెనక్కి తగ్గడం లేదు.
