ఓ ఉత్పాతం తప్పదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? వీలైనంత నష్టం తగ్గించాలి. ఆ ఉత్పాతం వచ్చి వెళ్లిపోయాక.. సాధారణ పరిస్థితుల్ని వీలైనంత వేగంగా తీసుకురావాలి. అందు కోసం ఏం చేయాలి..? ఏం చేస్తే పక్కాగా ఉంటుంది ?. ఎలా చేయాలి ? అనేది క్రైసిస్ మేనేజ్ మెంట్. తుపాన్ మొంథా ఏపీ తీరాన్ని తాకడం ఖాయమని తేలిపోయిన మరుక్షణం నుంచి చంద్రబాబు ఇదే పని చేస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చినప్పటి నుండి చంద్రబాబు నిద్రపోవడం లేదు..అధికారుల్ని నిద్రపోనివ్వడం లేదు.
చంద్రబాబు అనుభవమే ప్రజలకు రక్ష
ఏదైనా ఓ క్రైసిస్ ఎదురొచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ఓ విజన్ ఉండాలి. తొలి సారి అలా క్రైసిస్ ఎదుర్కొంటే అనేక పొరపాట్లు ఉండవచ్చు. కానీ ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు ఎన్నో ప్రకృతి విపత్తులను ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు. ఎలాంటి తుపాను వస్తే .. ఎలాంటి సమస్యలు వస్తాయో ఆయనకు బాగా తెలుసు. ఆ ఆనుభవాన్ని ఇప్పుడు పక్కాగా ఉపయోగిస్తున్నారు. పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని లైన్ లోకి తీసుకు వచ్చేశారు. తుపాను వచ్చేశాక ప్రజలు సాయం కోసం ఎదురు చూడకుండా ముందుగానే అన్నీ సిద్ధం చేసేశారు. అన్నింటికీ మించి ప్రజల్ని మానసికంగా ప్రిపేర్ చేశారు.
తుపానును ఎదుర్కొనేందుకు ప్రజలకూ మానసిక ధైర్యం
ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందంటే.. దాని వల్ల ఎంతో కొంత ఇబ్బంది వస్తుంది.. ఎదుర్కొనేందకు సిద్ధం కావాలని ప్రజల్ని ప్రిపేర్ చేయడం చాలా ముఖ్యమైన అంశం. ఎంత పెద్ద విపత్తు వస్తున్నా.. దాన్ని చూపించి వారిని భయ పెట్టకూడదు. కానీ అప్రమత్తం చేయాలి. ఇలాంటి విషయంలో చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో ఆయన మాస్టర్. అల్పపీడనం తుపానుగా మారుతుందని.. కాకినాడ దగ్గరే తీరం దాటుతుందని తెలిసిన తర్వాత తన అనుభవాన్నంతా ఉపయోగించి.. ఎదుర్కొనేందుకు సైన్యాన్ని సిద్ధం చేసి తాను ముందు నిలబడ్డారు.
చివరి బాధితుడికి సాయం అందే వరకూ నిద్రపోరు..నిద్ర పోనివ్వరు !
హుదూద్ సమయంలో చంద్రబాబు పని తీరు చూసిన ఎవరికైనా.. అలాంటి అడ్మినిస్ట్రేషన్ అందరికీ సాధ్యం కాదని ఎవరైనా చెబుతారు. హూదూద్ తో మొత్తం నేలమట్టం అయితే టెలికాం కంపెనీలు పరిస్థితుల్ని మెరుగుపర్చేందుకు బద్దకిస్తూంటే.. చంద్రబాబు ఇచ్చిన ఒకే ఒక్క వార్నింగ్ తో యాజమాన్యాలే దిగి వచ్చాయి. ఒక్క రోజులో సెల్ సిగ్నల్స్ వచ్చేలా చేశారు. అంతే.. ఆ తర్వాత పనులు చాలా వేగంగా సాగాయి. చంద్రబాబు క్రైసిస్ మేనేజ్ మెంట్ ఎంటో.. విశాఖ ప్రజలకు బాగా తెలుసు. ఈ సారి కాకినాడ.. తుపాను .. చంద్రబాబుకు ఎదుర్కొస్తోంది. ఎదుర్కొనేందుకు చంద్రబాబు తన బలగంతో నిలబడ్డారు.
