ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అప్లికేషన్ల గడువును మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఈ నెల 23 తేదీతో ముగిసిన గడువును జనవరి 23, 2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు, రియల్ ఎస్టేట్ సంఘాలు, ఆర్కిటెక్టులు, ప్లానింగ్ ప్రొఫెషనల్స్ నుంచి వచ్చిన వినతులతో ఈ నిర్ణయం తీసుకున్నారు
అనుమతులు లేఅవుట్లు, ప్లాట్లు ఉన్న ఆస్తి యజమానులకు రెగ్యులరైజ్ చేసుకునే అం అవకాశం లభిస్తుంది. దీని ద్వారా భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు, సివిక్ సేవలు వంటి సౌకర్యాలు సులభంగా అందుకోవచ్చు. ప్రభుత్వం ఈ స్కీమ్‌ను “అర్బన్ మేనేజ్మెంట్లో స్ట్రక్చరల్ రిఫార్మ్”గా వర్ణించింది, దీని ద్వారా అనుమతులు కాలనీలను చట్టబద్ధమైన, సర్వీస్-రెడీ కమ్యూనిటీలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎల్ఆర్ఎస్ 2025 కింద అప్లికేషన్లు సమర్పించాలంటే, ప్లాట్లకు జూన్ 30, 2025 ముందు రిజిస్టర్డ్ సేల్ డీడ్ లేదా టైటిల్ డీడ్ ఉండాలి. ఇది వ్యక్తిగత యజమానులు, వెల్ఫేర్ అసోసియేషన్లు, డెవలపర్లకు వర్తిస్తుంది,. లేఅవుట్లో కనీసం ఒక ప్లాట్ ఆ కటాఫ్ తేదీకి ముందు విక్రయించి ఉండాలి. మున్సిపల్ శాఖ ప్రకారం, ఈ స్కీమ్ ద్వారా సేకరించిన డబ్బు స్థానిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగిస్తారు.
అప్లికేషన్లు https://lrsdtcp.ap.gov.in పోర్టల్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. పెనాల్టీ భూమి విలువ ఆధారంగా లెక్కిస్తారు. త్వరగా చెల్లించినవారికి డిస్కౌంట్లు లభిస్తాయి. మునుపటి ఎల్ఆర్ఎస్-2020 దశలో పెండింగ్ లేదా అసంపూర్ణ అప్లికేషన్లు కూడా అప్డేటెడ్ నిబంధనల ప్రకారం ప్రాసెస్ చేస్తారు
