‘డ్రాగన్’ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకూ రషెష్ చూసుకొన్న ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నారని, ప్రశాంత్ నీల్ కి కొన్ని మార్పులూ, చేర్పులూ చెప్పారని, ప్రస్తుతం అందుకు సంబంధించిన రిపేర్లు జరుగుతున్నాయన్నది ఆ వార్తల సారాంశం. పెద్ద పెద్ద సినిమాలకు ఇలాంటి రిపేర్లు జరగడం సహజమే. ఏం చేసినా ఫ్యాన్స్ ని మెప్పించడానికే అనుకోవాలి. కాకపోతే.. ఇలా మార్పులూ, చేర్పులూ చేసుకొంటూ పోతే.. బడ్జెట్ ఎక్కడ ఆగుతుంది? సినిమా అనుకొన్న సమయంలో పూర్తవుతుందా, లేదా? అనే భయాలు వెంటాడుతుంటాయి. వీటిని దాటుకొని రావడం దర్శక నిర్మాతలకు పెద్ద టాస్క్.
సరిగ్గా ఇలాంటి రిపేర్లే మరో క్రేజీ సినిమాకూ జరుగుతున్నాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ముంబైలో షూటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకూ రషెష్ చూసుకొన్న టీమ్.. అవుట్ పుట్ పై కాస్త అసంతృప్తితో ఉన్నట్టు టాక్. దాంతో ఇప్పటి వరకూ తీసిన సన్నివేశాల్లో కొన్నింటిని రీ రైట్ చేసి, రీ షూట్ చేయాలని నిర్ణయించుకొన్నారని తెలుస్తోంది. సన్ నెట్ వర్క్ కూడా పెద్ద సంస్థే. ఇలాంటి ఖర్చులకు ఆ సంస్థ ఏమాత్రం వెనుకంజ వేయదు.
సినిమా జరుగుతున్నప్పుడే క్రాస్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. రీ షూట్ల వల్ల కాస్త ఖర్చు పెరగొచ్చు. రిలీజ్ డేట్ కాస్త గందరగోళంలో పడొచ్చు. కానీ మంచి ప్రోడెక్ట్ వస్తుంది. ఫ్యాన్స్ కూడా సినిమా ఆలస్యమైందా, ఖర్చు పెరిగిందా? అనేది ఆలోచించరు. సినిమా నచ్చితే సరిపోతుంది. దాని కోసమే దర్శక నిర్మాతలు ఇలా తాపత్రయ పడుతుంటారు.
