తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద రియల్ ఎస్టేట్ హబ్‌గా వరంగల్ దూసుకెళ్తోంది. వరంగల్-హనుమకొండ-కాజీపేట్ లాంటి మూడునగరాల సంగమం అయిన వరంగల్ ఇప్పుడు హాట్ ప్రాపర్టీగామారింది. మామనూరు విమానాశ్రయ విస్తరణ, మడికొండ ఐటీ SEZ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌తో పెట్టుబడిదారుల ‘గచ్చిబౌలి’ గా మారుతోంది. 2025లో ల్యాండ్ ధరలు 20 నుంచి 30 శాతం పెరిగినట్లుగా చెబుతున్నారు.
మామనూరు ఎయిర్పోర్ట్ వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో పూర్తవుతుంది.ఆపరేషన్స్ కూడా ప్రారంభమవుతాయి. మడికొండ SEZలో సైయంట్ , టెక్ మహీంద్రా, జెన్పాక్ట్, క్వాడ్రంట్ వంటి కంపెనీలు క్యాంపస్‌లు ఏర్పాటు చేశాయి. టెక్స్ టైల్ పార్క్, కోచ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయి. టెక్స్ టైల్ హబ్‌లో చాలా పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించాయి.
పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ ను ప్లస్ చేసింది. అందుకే పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం హనుమకొండలో 2BHK రూ. 30 నుంచి 50 లక్షల ధరలకులభిస్తున్నాయి. ఇళ్లు ఎక్కువగా నివాసం కోసం కొంటున్నారు. పెట్టుబడుల రూపంలో కొనాలనుకున్నవారు మామనూర్ హైవే ప్లాట్స్.. కొంటున్నారు. విల్లాలు, ప్రీమియం ప్రాజెక్టులపై ఎన్నారైలు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని సమయంలోపు పూర్తి చేస్తే.. వరంగల్ రెండో రాజధానిగా మారినట్లే అనుకోవచ్చు.
