తుపాను తీవ్రత తగ్గగానే వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ఏపీకి వచ్చి జబర్దస్త్ విమర్శలు ప్రారంభించారు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ పేరుతో ఈ సారి తన ప్రసంగాన్ని మీడియాకు ఇచ్చారు. ఆయనతో ఎవరు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారో కానీ.. ప్రెస్మీట్లు, పార్టీ నేతలతో సమావేశాల సమయంలో ప్రసంగించేలా.. ఈ సారి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రసంగించినట్లుగా వీడియో రిలీజ్ చేశారు.
అందుకే ఆయన చంద్రబాబునే టార్గెట్ చేసుకున్నారు. తుపాను చంద్రబాబును తెచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు తెచ్చిన విపత్తు వల్ల పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. పంటల బీమా లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని బాధపడ్డారు. గత పదహారు నెలల్లో అంటే.. చంద్రబాబు అధికారం చేపట్టిన పదహారు నెలల్లో తుపాన్లు, అల్పపీడనాలు, వాయుగుండాలు పదహారు వచ్చాయట. వాటన్నింటి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వచ్చే దిగుబడి తగ్గిపోతుందని బాధపడ్డారు.
ప్రభుత్వంలో పద్దతిగా జరిగిపోయేవాటిని కూడా ఏమీ జరగడం లేదని చెప్పుకుని ఆయన రాజకీయం చేస్తూంటారు. వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ చెప్పేది వినడమే కానీ..ఎదుటి వారు చెప్పేదేమీ ఉండదు. ఏమీ మాట్లాడకపోతే మర్చిపోతారని..ఇలా వీడియోలు రిలీజ్ చేసి.ఏదో ఒకటి మాట్లాడేస్తూంటారు.
