కల్తీ మద్యం కేసులో అసలు కుట్రదారుగా జోగి రమేష్ ను పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడ్ని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడంతో మొత్తం పూసగుచ్చినట్లుగా వివరించారు. వాటికి సంబంధించిన ఆధారాలను కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పటికప్పుడు అద్దేపల్లి సోదరులు చెప్పిన విషయాల ఆధారాలను సేకరించి ఆయన చెప్పిన వాటితో సరి పోల్చుకున్నారు. అంతా జోగి రమేష్ ప్లాన్ ప్రకారమే జరిగిందని మొత్తంగా పోలీసులకు క్లారిటీ వచ్చింది.
ప్రభుత్వం కుట్ర చేయాలనుకుంటే తన గుట్టంతా వెలుగులోకి !
అయితే రాజకీయంగా విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఆ నిందితులు చెప్పిన వివరాలను, వారు చూపించిన సాక్ష్యాలను..పోలీసులు సేకరించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. జోగి రమేష్ ను నిందితుడిగా చేర్చనున్నారు. ఆ తర్వాత విచారణకు పిలిచే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వంపై నిందలేయడానికి కల్తీ మద్యం ప్లాన్ చేస్తే.. మంత్రిగా ఉండి వైసీపీ హయాంలో చేసిన కల్తీ మద్యం వ్యాపారం గుట్టు బయటకు రావడం అనూహ్యమే. ఇప్పుడు జోగి రమేష్‌కు అదే పెద్ద సమస్య కానుంది.
తేలుకుట్టిన దొంగలా రోజుకో డ్రామా చేస్తున్న జోగి
కల్తీ మద్యం గుట్టు రట్టు అయినప్పటి నుండి జోగి రమేష్ నిద్రపోలేకపోతున్నారు. రోజుకో డ్రామా చేస్తున్నారు. ఒక రోజు ప్రమాణాలంటారు.. మరో రోజు సవాళ్లు అంటారు.. నిరూపిస్తే రాజకీయాల్లో ఉండనంటారు. ఆయన హడావుడి చేసి.. కాస్త క్రిమినాలజీలో నైపుణ్యం ఉన్నవారు.. దొరికిపోయిన దొంగ వేషాలు వేస్తున్నాడని అర్థం చేసుకుంటారు. ఆయన దొరికిపోయాడు కాబట్టే ఇంత కంగారు పడుతున్నడని ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది.
ఇదేమీ చిన్న నేరం కాదు !
ఇప్పుడు పోలీసులు ఆయనను విచారణకు పిలవబోతున్నారు. సాక్ష్యాలను బట్టి అరెస్టు చేసి లోపలేయనున్నారు. అదే జరిగితే ఇప్పుడల్లా బయటకు రావడం కష్టమవుతుంది. ఎందుకంటే ఆయనను హడావుడిగా అరెస్టు చేయడం లేదు. అంతా పద్దతి ప్రకారం విచారణ జరుపుతున్నారు. పైగా చేసింది చిన్న నేరం కాదు. తాను నేరం చేయించి.. ఆ నేరం ఇతరులపైకి నెట్టేయాలనుకున్నారు. దీన్ని ప్రతిఫలం గట్టిగానే ఉండే అవకాశం ఉంది.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                              
 
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                 
                