కృష్ణా నది ఒడ్డున ప్రశాంతంగా ఉండే విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్యరాజధాని. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ సెక్టార్ 2025లో విశాఖపట్నం, గుంటూరు తర్వాత మూడో స్థానంలో నిలుస్తోంది విజయవాడ. రెంటల్ మార్కెట్లో హై డిమాండ్ చూపిస్తోంది. ఇళ్లు,స్థలాల ధరలు హైదరాబాద్‌తో పోలిస్తే 30-40% తక్కువ ఉంటాయి. కానీ రెంటల్స్ ఇతర నగరాలతో సమానం.
పెనమలూరు వైపు 3 సంవత్సరాల్లో 65శాతం పెరుగుదల కనిపించింది. నివాసాలకు ఈ ప్రాంతం చాలా ఉత్తమంగా ఉంటుంది. కంకిపాడులో 30.8 శాతం పెరుగుదల కనిపించింది. ఇది కమర్షియల్ పెట్టుబడులకు అనుకూలం. బెంజ్ సర్కిల్, గన్నవరం, మంగళగిరి ప్రైమ్ లొకేషన్లుగా మారాయి. అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీలకు కేంద్రంగా ఉన్నాయి. ఉండవల్లి, తాడేపల్లిలో విల్లాలకు డిమాండ్ పెరిగింది.
ప్రస్తుతం అపార్టుమెంట్లలో ఎస్ఎప్టీకి రూ. 4,000 నుంచి రూ. 6,000 వరకూ అమ్ముతున్నారు. ప్రదేశాన్ని బట్టి. పెరుగుతోంది. గన్నరవం వైపు అయితే ఏడు వేల వరకూ చెబుతున్నారు. విల్లాల్లో రూ.ఎనిమిది వేల వరకూ ఎస్ఎఫ్టీ పలుకుతున్నాయి. ఏడాది పదిహేను శాతం వరకూ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కంకిపాడులో కమర్షియల్ కాబట్టి ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్ఎఫ్టీ ఏడు వేల వరకూ చెబుతున్నారు.
2025లో విజయవాడ రియల్ ఎస్టేట్ ‘బైయర్స్ మార్కెట్’గా మారి, హై ROI (10-15%) అందిస్తోంది. అమరావతి బ్యాకప్‌తో ఇది దక్షిణ భారతదేశంలో టాప్ డెస్టినేషన్ అవుతుందని అంచనా.
