తన కుటుంబంపై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధించారని మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ VITలో జరిగిన కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలు కాపాడిన న్యాయమూర్తులకు ఒత్తిళ్లు, బదిలీలు ఎదురయ్యాయని అన్నారు. నిజానికి మాజీ చీఫ్ జస్టిస్ గా ఆయన తనకు, తన కుటుంబానికి ఎదురైన వేధింపులపై చాలా పరిమితంగా మాట్లాడారు. ఆయనపై .. ఆయన కుటుంబం పై జరిగిన దాడుల గురించి తెలుసుకుంటే.. అప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న వారి కుటుంబం ఇంత ఘోరంగా దాడి చేసి.. అలాంటి నిందితులు దర్జాగా ఉండవచ్చా అని ఆశ్చర్యపోక తప్పదు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యుల బ్యాంక్ లావాదేవీల వివరాలను అక్రమంగా ఏపీ సీఐడీ పోలీసులు సేకరించారు. వారి ఆస్తుల వివరాలు బయటకు తీశారు. ఆ సమయంలో ఎన్వీ రమణ కుమార్తెలు అమరావతిలో చాలా కొద్ది స్థలం.. కొనుగోలు చేశారని కేసులు పెట్టారు. అలా కొనుగోలు చేయడం ఎలా నేరం అవుతుందో ఎవరికీ తెలియదు. అత్యంత ఘోరంగా చట్టాలను వక్రీకరించారు . వారికి తెలియకుండా వారి బ్యాంక్ లావాదేవీలను బయటకు తీయడమే నేరం.
ఇక చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ అపాయింట్ కావడానికి ముందే ఇవే తప్పుడు ఆరోపణలుతో ఓ పెద్ద లేఖ అప్పటి సీజేఐకి రాశారు. దాన్ని తన వందిమాగధులతో ప్రెస్ మీట్ పెట్టి విడుత చేయించారు. జస్టిస్ ఎన్వీ రమణపై తప్పుడు ప్రచారంతో దాడిచేశారు. తర్వాత అంతర్గత విచారణలో జగన్ రెడ్డి చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని తేల్చారు. కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
న్యాయవ్యవస్థ పునాదులపై కేసు ప్రకారం ఓ కరడుగట్టిన నేరస్తుడు అయిన జగన్ రెడ్డి చేసిన దాడికి వ్యవస్థ భరించింది కానీ.. ఆయన చేసిన దాడులకు తగిన శిక్ష విధించే ప్రయత్నం చేయలేదు. అదే అలాంటి వారికి ధైర్యం వస్తుంది. చివరికి ఆయన కేసుల్లోనూ న్యాయవ్యవవస్థ అనుకున్నంతగా వేగంగా పని చేయడం లేదు. అంటే ఆయన బ్లాక్ మెయిలింగ్ పని చేసిందని ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి.
