మహిళా క్రికెట్లో కొత్త సంచలనం జెమీమా రోడ్రిగ్స్. మహిళల ప్రపంచ కప్ లో భారత్ .. ఫైనల్ చేరిందంటే రోడ్రిగ్స్ ఇన్నింగ్సే కారణం. అంతకు ముందు చాలా మ్యాచులు ఆడినా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తక్కువే ఆడారు జెమీమా.ఈ సారి మాత్రం పట్టుదలగా ప్రపంచ రికార్డు స్థాయి టార్గెట్ ను చేధించడంలో కీలక పాత్ర పోషించారు. అంత వరకూ బాగానే ఉన్నా… విజయం తర్వాత ఆమె జీసస్కు క్రెడిట్ ఇవ్వడంపై చర్చ ప్రారంభించారు. ఆమె ఆడిన ఇన్నింగ్స్ ను పక్కన పెట్టి.. ఆమె మతం, దేవుడికి క్రెడిట్ ఇవ్వడంపైనే ఇప్పుడు చర్చిస్తున్నారు. దాని వల్ల ఫైనల్లో ఆమె ఆటతీరు ప్రభావితం అయినా ఆశ్చర్యం లేదు.
నమ్మే దేవుడికి క్రెడిట్ ఇవ్వడం అందరూ చేసే పనే !
జెమీమా రోడ్రిగ్స్ ఈ పేరు వింటేనే ఆమె క్రైస్తవురాలు అని అర్థం అయిపోతుంది. ఆమెకు దైవభక్తి మెండు అని మాటల ద్వారా స్పష్టమవుతోంది. మనిషికి దేవుడు ఓ నమ్మకం. ఆయన తన వెనుక ఉన్నాడు అని గట్టిగా నమ్మిదే ఎంతటి కష్టాన్ని అయినా భరించి లక్ష్యాన్ని చేరుతారు. ఆ నమ్మకం అనే దేవుడు జెమీమా రోడ్రిగ్స్ వెనుక ఉన్నారు. అందుకే భారత్ ను ఫైనల్ కు తీసుకెళ్లే ఇన్నింగ్స్ ఆడారు. ఇతర ప్లేయర్లు తమ గొప్ప ఇన్నింగ్స్ ఆడినప్పుడు దైవానికి.. అంటే తాము నమ్మిన దైవానికి కృతజ్ఞతలు చెబుతారు. అలాగే జెమీమా రోడ్రిగ్స్ చెప్పారు. అదేమీ అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు.
జెమీమాపై వ్యతిరేక ప్రచారం చేస్తే దేశ ఇమేజ్ కే నష్టం
కొంత మంది సోషల్ మీడియాలో మరీ అతి చేస్తున్నారు. ఆమెను భారత జట్టు నుంచి తప్పించాలని అంటున్నారు. ఇలాంటి వారి వల్లే అసలు సమస్యలు వస్తున్నాయి. మత పరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి తప్ప దేశానికి వీరి వల్ల పైసా ఉపయోగం ఉండదు. జెమీమా ప్రపంచరికార్డు స్కోర్ ను ఛేజ్ చేసేందుకు తన వంతు కృషి చేసి..దేశానికి పేరు తెచ్చి పెట్టారు. ఇప్పుడు ఆమె జీసస్ కు క్రెడిట్ ఇవ్వడం తప్పని వాదించేవారి వల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా?
దేవుడు ఒక్కడే… ఏ రూపంలో నమ్మితే ఆ రూపం
దేశానికి అతి పెద్ద సమస్యగా మూఢనమ్మకాలు ఉన్నాయి. మత మార్పిళ్లు ఉన్నాయి. ఎవరి మతాన్ని వారు ఆచరిస్తే సమస్య కాదు. కానీ మతాలను మార్చేందుకు కొంత మంది ప్రయత్నించడమే సమస్యగా మారింది. మీ దేవుడు గొప్ప..మా దేవుడు గొప్ప అని విద్వేషాలు చూపించుకుని.. ప్రసాదాలు కూడా తినని దౌర్భాగ్య స్థితిని దేశంలోకి తీసుకొచ్చారు. అందుకే ఇలాంటి విద్వేషాలు పెరుగుతున్నాయి. దేవుడు ఒక్కడే.. దేవుడు ఎప్పుడూ ఎవరిపై విద్వేషం చూపించడు.. అలా చూపిస్తే దేవుడు కాదు. ఈ కాన్సెప్ట్ ను జనం ఎందుకు అర్థం చేసుకోవడం లేదో
వీటికి అడ్డుకట్ట వేయడం అసాధ్యం.కానీ ఈ విద్వేషాలు దేశ పరువు తీయకుండా చూసుకోవాల్సినంత విజ్ఞత మాత్రం ప్రజలు పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
