వైసీపీ నేతలకు రాజకీయంగా ఇబ్బంది వస్తే చాలు ప్రభుత్వం డైవర్ట్ చేయడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటుందని విచిత్రమైన వాదనతో తెరపైకి వస్తారు. జోగి రమేష్ అరెస్టును వైసీపీ డైవర్షన్ గా చూస్తోంది. ఎందుకంటే ఆలయంలో తొక్కిసలాట ఘటన, మొంథా తుపాను నష్టం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జోగిని అరెస్టు చేశారని వైసీపీ చెబుతోంది. జోగిని అరెస్టు చేసినంత మాత్రాన ఆయా సమస్యలు వెనుకబడిపోతాయా?. అసలు వాటికి జోగికి సంబంధమేంటి ? . నిజంగా అనే సమస్యలు అనుకుంటే.. వైసీపీ ఏం చేయాలి ?
డైవర్ట్ కాకుండా వైసీపీ రాజకీయాలు చేయాలి!
టీడీపీ ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి డైవర్ట్ చేస్తుదంని అనుకుంటే వైసీపీ పూర్తిగా.. తాము ఏ అంశంపై రాజకీయాలు చేయాలనుకుంటున్నారో.. ఏ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలనుకుంటున్నారో అవే అంశాలపై మాట్లాడాలి. జోగి అరెస్టును పట్టించుకోకుండా ప్రజా సమస్యలను తెరపైకి తీసుకు రావాలి. అప్పుడు మాత్రమే టీడీపీ వ్యూహాన్ని పక్కన పెట్టి.. తమదైన రాజకీయాలు చేసినట్లుగా అవుతుంది. అలా కాకుండా.. తాము కూడా అన్ని మర్చిపోయి.. జోగి రమేష్ అరెస్టు అక్రమం అని పిట్టకథలు రాసుకుంటే… టీడీపీ వ్యూహంలో చిక్కినట్లేగా . కానీ అదే చేస్తోంది. అంటే వైసీపీది చేతకానితనమే.
జోగి అహంకారాన్ని ఎవరైనా మరచిపోతారా?
కృష్ణాజిల్లాలో కొడాలి నాని, పేర్ని నానిలను మంత్రులుగా తీసేసి జోగి రమేష్ కు జగన్ ఎందుకు మంత్రి పదవి ఇచ్చారు?. ఈ విషయం వైసీపీలో అందరికీ తెలుసు. కొడాలి నాని తన పదవిని కాపాడుకోవడానికి ఎన్ని బూతులు మాట్లాడారో.. అందరికీ తెలుసు. ఆయన జీవితంతో జగన్ రెడ్డి ఆడుకున్నారు. ఎవరూ మంచిగా చూడలేని దౌర్భాగ్యమైన స్థితికి కొడాలి నాని చేరుకున్నారు. ఆయనకు మరో దారి లేక తన దగ్గరే ఉండిపోయేలా చేశారు. అప్పుడు మంత్రి పదవిని పీకేశారు. తన ఆలోచనలకు తగ్గట్లుగా బూతుల దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి వంటివి చేసి.. పదవి పొందారు. మిగతా ఇద్దర్నీ జగన్ బకరాలను చేశారు.
అదే సందు అని అక్రమ మద్యం వ్యాపారానికి అండదండలు
తనకు కృష్ణా జిల్లాలో తిరుగులేదని ఏకైక మంత్రిని అని జోగి రమేష్ చేసిన అకృత్యాలతో ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. అసెంబ్లీలో రఘురామకృష్ణరాజును అత్యంత ఘోరంగా తిట్టిన రికార్డు ఆయనకు ఉంది. బయట చేసే నోటి విరేచనాల సంగతి చెప్పాల్సిన పని లేదు. పట్టుకునేవారే లేరని చెప్పి.. పెద్ద ఎత్తున అరాచకాలు చేసిన ఆయనను వదిలి పెట్టడం చేతకానితనం అవుతుంది. వైసీపీ ఆయనది డైవర్షన్ అరెస్ట్ అయితే.. డైవర్ట్ కాకుండా.. తాము అనుకున్న ప్రజా సమస్యలపైనే దృష్టి సారించాలి. వారూ తెలిసి డైవర్ట్ అయిపోతే ఇక ప్రభుత్వ ట్రాప్ లో పడిపోయినట్లే కదా !
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              