పులకేశీలాగా అమెరికా ప్రజల్ని పట్టి పీడిస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టి షాక్ తగిలిగింది. అమెరికా స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్లు ఘోరపరాజయం పాలయ్యారు. డెమోక్రట్లే ఆధిపత్యం చూపించారు. మొత్తం 2,500కి పైగా మేయర్, కౌన్సిల్ , షెరిఫ్, గవర్నర్ పోస్టుల్లో డెమోక్రట్లు 1,247 సీట్లు గెలిచారు. 2023లో 1,058తో పోలిస్తే 18% పెరిగింది. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. కాలిఫోర్నియాలో యాభై స్థానాల్లో 45 డెమెక్రాట్లు గెలిచారు. న్యూయార్క్, టెక్సాస్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియాలో రిపబ్లికన్లు ఘోరంగా ఓడిపోయారు. రిపబ్లికన్లు 987 సీట్లు మాత్రమే గెలిచారు.
ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్ట్ జోరాన్ మమ్దానీ ఘన ఘన విజయం సాధించారు. ట్రంప్ మద్దతిచ్చిన ఆండ్రూ క్యూ మోపై ఘోర పరాజయం పాలయ్యారు. జోరాన్ మొదటి ముస్లిం-భారతీయ మేయర్‌గా చరిత్ర సృష్టించారు. 33 ఏళ్ల యువకుడైన మమ్దానీ, క్వీన్స్‌లోని అసెంబ్లీ మెంబర్‌గా ఇప్పటికే పని చేశారు డొనాల్డ్ ట్రంప్ మమ్దానీని ‘సీరియస్ థ్రెట్’గా పేర్కొని, ప్రచారంలో తీవ్రంగా విమర్శించినప్పటికీ 58 శాతం ఓట్లు ఆయనకు వచ్చాయి.
రిపబ్లికన్ లీడర్ డొనాల్డ్ ట్రంప్ మమ్దానీని “రాడికల్ లెఫ్ట్ సోషలిస్ట్”గా విమర్శించేవారు. తను గెలిస్తే న్యూయార్క్ సోషలిస్ట్ హెల్హోల్గా మారుతుందని ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇది రివర్స్ అయింది. పాలనలో ఘోరాల కారణంగా ట్రంప్ రేటింగ్ విపరీతంగా పడిపోయిందని ఇప్పటికే అనేక ప్రజాభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. మరోసారి స్థానిక ఎన్నికలతో నిరూపితమయింది.
