మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం.. ఆంధ్రా పేరుతో చేసిన అవినీతి ఆటలో నివేదిక ప్రభుత్వానికి చేరి రెండు, మూడు నెలలు అవుతోంది. కానీ ప్రభుత్వం ఆ రిపోర్టును ఏం చేస్తుందో కానీ.. రోజా మాత్రం చక్కగా తమిళనాడులో సినిమాలు, టీవీ షోలు చేసుకుంటున్నారు. కొత్తగా ఆమె లెనిన్ పాండియన్ అనే సినిమాలో వృద్ధురాలి పాత్ర పోషించారు. ఆ వీడియోను సినిమా టీం విడుదల చేసింది.
90ల్లో యువతకు గిలిగింతలు పెట్టిన రోజా పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారని ప్రకటించారు. రోజాకు శరత్ కుమార్, రాధిక, ప్రభుత్వదేవా వంటి వాళ్లు శుభాకాంక్షలు చెప్పారు. రోజా వారికి ధ్యాంక్స్ చెప్పారు. లెనిన్ పాండియన్ సినిమాలో రోజా సంతానం అనే పాత్రలో వృద్ధ మహిళగా కనిపిస్తారు. చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో క్లిక్ అయితే ఆమెకు మంచి అవకాశాలు వస్తాయి. అదే జరిగితే ఇక రాజకీయాలపై సమయం తగ్గించే అవకాశం ఉంది.
ఇప్పటికే రోజా ఎప్పుడో ఓ సారి కనిపిస్తున్నారు. రోజాకు బదులుగా శ్యామలకు ప్రెస్మీట్లలో మాట్లాడే బాధ్యతలు ఇచ్చారు. ఫలానా అంశంపై మాట్లాడాలని ఆమెకు చెప్పడం లేదు. ఎప్పుడో ఓ సారి తానున్నానని గుర్తు చేసేందుకు ఆమె స్పందిస్తున్నారు. ఇప్పుడు సినిమాల్లో బిజీ అయితే పూర్తిగా అటు వైపే దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని బట్టి.. మళ్లీ ఎంట్రీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు.