క్వీన్స్‌ల్యాండ్ వేదికగా ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. గిల్ 46, అభిషేక్ శర్మ 28, శివమ్ దూబే 22 పరుగులతో రాణించారు. ఒక దశలో ఇండియా 180 పైచిలుకు పరుగులు చేస్తున్నట్లు కనిపించింది. అయితే నెతన్ ఎలిస్, జంపా చెరో మూడు వికెట్లు తీసి భారత్ దూకుడుకి అడ్డుకట్ట వేశారు.
166 పరుగుల లక్ష్యంతో దిగిన ఆసీస్ ఓపెనర్లు మొదట్లో ఈజీగా పరుగులు రాణించారు. మార్ష్ 30, షార్ట్ 25 పరుగులు చేసి దూకుడు చూపారు. అయితే షార్ట్ వికెట్ పడ్డాక ఆసీస్ కథ అడ్డం తిరిగింది. భారత్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా స్పిన్ బాగా తిరిగింది. సుందర్ 3, అక్షర్ 2 వికెట్లతో ఆసీస్‌ను దెబ్బకొట్టారు. మరోవైపు శివమ్ దూబే రెండు కీలక వికెట్లు తీశాడు. ఆసీస్ 119 పరుగులకు ఆలౌటైంది.
ఇది ఐదు మ్యాచుల సిరీస్. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆసీస్ ఒక మ్యాచ్ గెలిచింది. వరుసగా రెండు విజయాలతో ఇండియా 2-1 లీడ్‌లోకి వచ్చింది. ఈ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయింది భారత్. ఈ విజయంతో సిరీస్‌ను సేఫ్ జోన్లో పెట్టింది. ఫైనల్ గెలిచి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం భారత్ చేతిలో ఉంది.
