అమెరికా వీసా కావాలంటే ఇక డయాబెటిస్ ఉండకూడదు. అది ఉంటే వీసాఇవ్వరు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల జారీ చేసిన కొత్త గైడెన్స్ ప్రకారం, డయాబెటిస్, ఊబకాయం, హార్ట్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని ‘పబ్లిక్ చార్జ్’ అంటే పబ్లిక్ కి ఆర్థిక భారంగా పరిగణించి వీసా నిరాకరిస్తారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల జారీ చేసిన ఈ గైడెన్స్, వీసా అధికారులకు మెడికల్ కండిషన్స్‌పై మరింత డీప్ అసెస్మెంట్ చేసే అధికారాన్ని ఇచ్చింది.
డయాబెటిస్, ఊబకాయం, కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్, మెటబాలిక్ డిసీజెస్, న్యూరాలజికల్ డిసీజెస్, మెంటల్ హెల్త్ కండిషన్స్ వంటివి ‘హై కాస్ట్’గా పరిగణిస్తారు. వీసా కోరేవారి మెడికల్ హిస్టరీ, ఫ్యూచర్ ట్రీట్మెంట్ కాస్ట్, ఉపాధి సామర్థ్యాన్ని అసెస్ చేస్తారు. ఇమ్మిగ్రెంట్ వీసాలకు ప్యానెల్ ఫిజిషియన్ ఎగ్జామ్ ఇప్పటికే ఉంది .. కానీ కొత్త గైడెన్స్‌తో డయాబెటిస్ పై ఫోకస్ పెంచుతారు.
అమెరికా వీసా అప్లై చేసేవారందరూ మెడికల్ ఎగ్జామ్ చేయాలి. డయాబెటిస్ వంటివి ఇంతకు ముందు సమస్య కాదు. కానీ ఈ సారి మాత్రం కలిపారు. రానిక్ డిసీజెస్ ఉన్నవారు ‘గవర్నమెంట్ హెల్త్‌కేర్’పై డిపెండ్ అవుతారని భావిస్తే వెంటనే రిజెక్ట్అవుతారు. ఇండియాలో డయాబెటిస్ పేషెంట్లు 10 కోట్లు, వీరిలో చాలామంది H1B, టూరిస్ట్ వీసాలు కోరుతున్నారు. కొత్త రూల్స్‌తో రిజెక్షన్ రేట్ 20-30% పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
