ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖ సీఐఐ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఏర్పాట్లు చేస్తోంది. మరో వారం రోజుల్లో ఈ ఘనమైన కార్యక్రమం జరగనుంది. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారు. ఎమ్మెన్సీ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు. పది లక్షల కోట్ల వరకూ పెట్టుబడుల ఒప్పందాలు జరుగుతాయని ఈ మేరకు ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని నారా లోకేష్ ప్రకటించారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. దీనికి కౌంటర్ గా .. వైఎస్ జగన్ ఏదో ఒకటి ప్లాన్ చేస్తారని .. అదేమిటని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, పోలీసులు, టీడీపీ పెద్దలు కూడా పరిశీలనగా చూస్తున్నారు. ఎందుకంటే జగన్ మార్క్ ను వారు అంచనా వేయలేరు.
గతంలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముందు రోజు వైజాగ్ లో బంద్
టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఓ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించారు. అప్పట్లో.. ప్రత్యేకహోదా పేరుతో వైఎస్ జగన్ చేసిన రచ్చ కారణంగా ముందు రోజు బంద్ పాటించాల్సి వచ్చింది. ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి చాలా షో చేసి.. ఎయిర్ పోర్టు నుంచే బయటకు వచ్చేశారు. అలాగే ఇతర సమ్మిట్ల సమయంలోనూ ఏదో ఓ రచ్చ వైసీపీ చేస్తూనే ఉంటుంది. ఈ సారి కూడా వదిలి పెట్టరని ఏదో ఒక రచ్చ చేసి.. రాష్ట్రం పరువు తీస్తారని కొంత మంది భయపడుతున్నారు. వైసీపీ, జగన్ ప్లాన్లను అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారు.
తప్పుడు ప్రచారాలతో దాడి ఖాయం
కుట్రలు చేస్తే దొరికిపోతామన్న భయంతో ఈ సారి ఫిజికల్ గా అల్లర్లు రేపకపోయినా.. తప్పుడు ప్రచారాలు మాత్రం ఖాయమని సులువుగా అర్థం చేసుకోవచ్చు. అయితే కులాల చిచ్చు పెట్టడానికి.. అంతకు మించి రాజకీయ గొడవలు చేయడానికి వైసీపీ వద్ద పుట్టెడు తెలివితేటలు ఉంటాయి. చేతిలో సాక్షి మీడియా ఉంది..వందల కోట్లు ఖర్చు పెట్టి నడుపుతున్న సోషల్ మీడియా ఉంది. మంచి చేయాలనుకుంటే చేయలేకపోవచ్చు కానీ చిచ్చు పెట్టడానికి మాత్రం చాలా సమర్థత చూపుతారు. తప్పుడు ప్రచారాలతోనే వారు చేయాలనుకున్నది చేస్తారు. పెట్టుబడుల సదస్సు దగ్గర పడేకొద్దీ.. వైసీపీ, జగన్ టార్గెట్లు ఏమిటో బయటకు వచ్చే అవకాశం ఉంది. వాటిని పోలీసులు, యంత్రాగం ఎంత మేర నిర్వీర్యం చేస్తారన్నది కూడా కీలకమే.
ఏ మాత్రం అపశృతి చోటు చేసుకున్నా ఏపీకి చెడ్డపేరు
ఐదు సంవత్సరాలు అడ్డగోలు పరిపాలన.. పారిశ్రామికవేత్తలకు పీడకలలాంటి పరిస్థితుల తర్వాత మళ్లీ సాధారణ స్థితి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు విపరీతంగా కష్టపడుతున్నారు. ఆయన అనుభవం ఉపయోగపడుతోంది. కానీ అటు పారిశ్రామికవేత్తల వద్ద నమ్మకం పెంచుకోవాలా..ఇటు కుట్రలు చేసి వచ్చేవారిని రాకుండా చేస్తారని కాపలా కాయాలా అన్నది పెద్ద సమస్య. జగన్ రెడ్డికి .. వైసీపీకి రాష్ట్రంపై ఎలాంటి ప్రేమ లేదు. మొత్తం నాశనం చేసేసిన వైనమే అది నిరూపిస్తోంది. రేపు పెట్టుబడుల సదస్సుపైనా ఇదే తరహాలో ఆయన మార్క్ రాజకీయ దాడి చేస్తే చంద్రబాబుకు నష్టం జరగదు.. ఏపీ పరువు పోతుంది. అందుకే యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవవసరం కనిపిస్తోంది.
