కర్నూలు బస్సు ప్రమాదం వ్యవహారంలో తప్పుడు ప్రచారాలు చేయడంలో మాస్టర్ మైండ్ గా పూడి శ్రీహరి అనే వైసీపీ మీడియా వ్యవహారాలను చూసే ప్రధాన కార్యదర్శిని గుర్తించారు. పోలీసులు నోటీసులు ఇచ్చారు. సజ్జల కనుసన్నల్లో పని చేసే ఈ పూడి శ్రీహరి చేసిన పనులు చిన్నవి కాదు.
సర్వీసులో ఉన్న ఐపీఎస్పై ఆధారాలు లేకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? . ఆ బాధ మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అనుభవించారు. దానికి కారణం పూడి శ్రీహరి అనే వ్యక్తి. ఆయన ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శిగా మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. అప్పట్లో సీపీఆర్వోగా ఉండేవారు. ఏబీ వెంకటేశ్వరరావు ను సస్పెండ్ చేయాలనుకున్నప్పుడు.. ఈ తప్పుడు ప్రచారాలను అధికారిక మీడియా గ్రూపుల్లో ఆధారాలు లేకుండా ఈ పూడి శ్రీహరే ప్రచారం చేశారు. దీన్ని ఏబీ వెంకటేశ్వరరావు కూడా చాలా సార్లు చెప్పారు.
ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుపై ఎలాంటి నేరాలను నిరూపించలేకపోయారు. ఆయనను వేధించారని తేలింది. ఆయన ఐదు సంవత్సరాల సర్వీస్ మిస్ అయింది. ఆయనపై మరకలు పడటంతో ఈ పూడి శ్రీహరి కీలక వ్యక్తి. ఆయనపై చర్యలు తీసుకోవాలని నష్టపోయిన వ్యక్తిగా మాజీ ఐపీఎస్ కోరుకుంటారు. తాను వదిలేది లేదని గతంలో కూడా ప్రకటించారు. ఒక్క ఏబీ వెంకటేశ్వరరావు పై కాదు.. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై జరిగిన జరిగిన వ్యక్తిత్వ హననానికి పూడి శ్రీహరిదే ప్లాన్. ఆయన చేతుల మీదుగానే స్క్రిప్టులు వెళ్లాయి. ప్రచారం జరిగింది.
ఓడిపోయాక కూడా అదే చేస్తున్నాడు అంటే… పాలకులంటే భయం లేదని అర్థం. ఇప్పుడు కూడా వదిలి పెడితే.. ఇలాంటి వాళ్లు రెచ్చిపోతారు. నోటీసులతోనే ఆగిపోకుండా.. కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి వారి బాధితులకు కాస్త ఉపశమనం ఉంటుంది. ఇప్పటికీ జరిగే ఫేక్ ప్రచారాలకు ఈయనే ఆద్యుడు కాబట్టి ఇప్పుడే గుర్తించారు కాబట్టి.. ఆ దిశగా చర్యలు తీసుకుంటే బాధితులు కాస్త సంతోషిస్తారు.
