భారతదేశంలో రియల్ ఎస్టేట్ మోసాలు ఎంతో పెద్ద సమస్యగా మారాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది కొనుగోలుదారులు మోసపోతున్నారు. ప్రిలాచ్ పేరుతో సర్వం దోపిడీ చేయడం ఒకటి అయితే ఆలస్యంగా ఇవ్వడం, తప్పుడు ప్రాజెక్టులు, ఫేక్ డాక్యుమెంట్లు వంటివి మరికొన్ని. 2025 దేశంలో ఒక లక్షానికి పైగా రియల్ ఎస్టేట్ మోసాలపై ఫిర్యాదులు దాఖలయ్యాయని అంచనా. ఫలితంగా వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతోంది, ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, తెలంగాణలో ఇలాంటి మోసాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మోసపోయినవారు తమ డబ్బుల్ని తిరిగి వసూలు చేసుకోవడం దాదాపుగా అసాధ్యంగా మారింది. సాహితి వంటి సంస్థలు ప్రీలాంచ్ పేరుతో వసూలు చేసిన మొత్తంలో రూపాయి కూడా తిరిగివ్వడం లేదు. ఇలాంటి మోసాలకు పాల్పడిన వారు.. కేసులు నమోదయ్యాక జైళ్లకు వెళ్తున్నారు. వారి ఆస్తులు దర్యాప్తు సంస్థలు జప్తు చేస్తున్నాయి. కానీ బాధితులకు మాత్రం రూపాయి తిరిగి రాదు.
అయితే రెరా కింద రిజిస్టర్ అయిన కంపెనీలు మోసానికి పాల్పడితే మాత్రం కొంత రికవరీ చేయగలుగుతున్నారు. RERA కింద లక్షలాది మందికి పాక్షిక లేదా పూర్తి రిఫండ్లు వస్తున్నాయి, మొత్తంగా, మోసపోయినవారిలో 70-77 శాతం మందికి డబ్బు లేదా పరిహారం తిరిగి వస్తోంది. కానీ ఎంతో మానసిక అలసట ఎదురవుతోంది. న్యాయంకోసం పోరాడాలి. అందుకే రియల్ ఎస్టేట్ విషయంలో.. జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే ముందు అన్ని విషయాలు ఆలోచించాలి .
