సుధీర్ బాబు ‘జటాధర’ సినిమా చూసి జనాలు షాక్ అయ్యారు. ఈ మధ్యకాలంలో ఇంత దారుణమైన మేకింగ్‌తో వచ్చిన సినిమా మరొకటి లేదని ఫీల్ అయ్యారు. కథ, కథనాలు, నటన..ఏవీ కూడా ఒక సినిమా స్థాయిలో లేవు. 20 సినిమాలు చేసిన సుధీర్ బాబు ఇలాంటి దారుణమైన ఫిల్మ్ మేకింగ్‌తో ఉన్న సినిమాలో హీరోగా నటించడం బాధాకరం.
సుధీర్ బాబు కెరీర్ అసలు బాలేదు. తనకు విజయాలు లేవు. అలాంటప్పుడు కథ, కథనాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే.. ఈ సినిమా కథ తయారు చేసుకుంది సుధీర్ బాబు అండ్ టీం. నిర్మాత ప్రేరణ అరోరా, సుధీర్ బాబుతో తెలుగులో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. ఆమె ఒక కథ చెప్పారు. సుధీర్ బాబుకు నచ్చలేదు. అప్పటికే సుధీర్ బాబు టీం డెవలప్ చేస్తున్న ఒక కథని నిర్మాత ప్రేరణకి చెప్పారు. అందులో పాయింట్ ఆమెకు నచ్చింది. అలా ఈ సినిమా సెట్‌పైకి వెళ్లింది. తీరా సినిమా చూస్తే షాక్ అవ్వాల్సి వచ్చింది.
సుధీర్ బాబుకు ఇది హై టైమ్. ఎందుకంటే ఇన్ని పరాజయాలు వచ్చిన తర్వాత కూడా మళ్లీ హీరో రేస్‌లో నిలబడటం చాలా కష్టం. సుధీర్ బాబు వెంటనే మేల్కోవాలి. తన స్ట్రెంత్ తెలుసుకొని, అందుకు తగినట్టు కథలు చేస్తేనే కెరీర్ గాడిలో పడుతుంది. ఇది సుధీర్ బాబు త్వరగా గ్రహిస్తే మంచిది.


