తెలంగాణలో రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. కేసీఆర్ మినహా అగ్రనేతలంతా అన్ని పార్టీల తరపున ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ప్రచారాన్ని కేటీఆర్ లీడ్ చేశారు. కాంగ్రెస్ ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ఒంటిచేత్తో నడిపారు. బీజేపీ ప్రచారాన్ని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాగారు.
ఈ ఎన్నికల్లో ఓటర్లకు ఏ పార్టీ కూడా ఓ అజెండా డిసైడ్ చేయకపోవడమే అసలు విషయం. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఆర్ఎస్ ఓటింగ్ అజెండాను డిసైడ్ చేసేందుకు గట్టి ప్రయత్నం చేసింది. ఆఫ్ లైన్, ఆన్ లైన్లో ఖర్చుకు వెనుకాడకుండా భారీ ప్రచారం చేసింది. ఆ పార్టీకి గెలుపు అత్యవసరం కూడా. కాంగ్రెస్ పార్టీ లో సమన్వయం లోపం ఉన్నా రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. నవీన్ యాదవ్ తన గెలుపు కోసం చేయగలిగినంత చేసుకుంటున్నారు. బీజేపీపై ఇతర పార్టీలు డిపాజిట్ తెచ్చుకోమని సవాల్ చేస్తున్నాయంటే ఎంతగా విఫలమయిందో అర్థం చేసుకోవచ్చు.
ఎన్నికల్లో గెలవడానికి పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం. తమకు ఓటేస్తారనుకున్న వారందర్నీ.. పోలింగ్ బూత్ల వద్దకు తెచ్చుకునే అంశంపైనే గెలుపు ఆధారపడి ఉంటుంది. అందుకే పార్టీలన్నీ రెండు రోజుల పాటు అన్నిరకాల పోల్ మేనేజ్ మెంట్ ప్రయత్నాలూ చేస్తాయి. అందుకే జూబ్లిహిల్స్ లో ప్రచారం ముగిసినా పోలింగ్ అయ్యే వరకూ సందడిగానే ఉంటుంది.