బాలీవుడ్ వెటరన్ ధర్మేంద్ర మృతి చెందారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. ప్రముఖులు కూడా సంతాపం ప్రకటించేశారు. అయితే ధర్మేంద్ర కుమార్తె ఈషా దేవోల్ ఈ వార్తలని ఖండిచారు. ‘నాన్నగారు స్థిరంగా ఉన్నారు. కోలుకుంటున్నారు. మా కుటుంబానికి కొంత ప్రైవసీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాన్నగారి త్వరితగతిన కోలుకోవడానికి అందరూ చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు’ అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.
ధర్మేంద్ర ఆరోగ్యం కొంతకాలంగా బాలేదు. ఆయనకి 89 ఏళ్ళు. చికిత్స కొనసాగుతున్నప్పటికీ ఆయన శరీరం స్పందించడం లేదంటూ నిన్న వార్తలు వచ్చాయి. ఈరోజు బాలీవుడ్ లోని ప్రముఖ ఛానల్స్ అన్నీ ఆయన మృతి చెందినట్లు వార్తలు ఇచ్చేశాయి. ఈ వార్తలు వచ్చిన కొన్ని గంటల తర్వాత కూడా కుటుంబ సభ్యులు ఎవరూ స్పందింలేదు. దీంతో మీడియాలో వచ్చిన వార్తలు నిజం అనుకున్నారు. సోషల్ మీడియాలో అందరూ సంతాపం ప్రకటించారు. ఇప్పుడు ఈషా దేవోల్ ఆ మరణ వార్తలని ఖడించారు. ఇలాంటి సెన్సిటివ్ వార్తలు కుటుంబం దృవీకరించేవరకూ ప్రచురించకపోవడం మంచిది.

