విశాఖలో జరుగుతున్న ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ప్రధానాకర్షణగా చంద్రబాబే నిలుస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు అయనే సెంటరాఫ్ ఎట్రాక్షన్. చంద్రబాబుతో మాట్లాడేందుకే చాలా మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. అదే విషయాన్ని కొంత మంది బహిరంగంగా చెబుతున్నారు కూడా. చంద్రబాబుకు ఉన్న అనుభవం, విజనరీ ఆలోచనలు.. తమ వ్యాపారాలకూ ఉపయోగపడతాయని వారు భావిస్తున్నారు. అందుకే పెట్టుబడుల సమ్మిట్ కు వచ్చి అక్కడ జరుగుతున్న ప్యానల్ డిస్కషన్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
పారిశ్రామిక వర్గాల్లో చంద్రబాబుకు ప్రత్యేక ఇమేజ్
చంద్రబాబుకు పారిశ్రామిక వర్గాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మొదటి సారి సీఎం అయినప్పటి నుండి పెట్టుబడులు, పరిశ్రమలు, స్కిల్, ఉపాధి అంటూ ఆయన చేసిన ప్రయత్నాలు, ఇచ్చిన సలహాలతో ఎన్నో దిగ్గజ కంపెనీలు విస్తరించాయి. రిలయన్స్ గ్రూపు టెలికాంలోకి రావడానికి కూడా చంద్రబాబు సలహానేనని చాలా సార్లు చెప్పారు కూడా. భవిష్యత్ అవసరాలను గుర్తించి.. దానికి తగ్గట్లుగా పెట్టుబడుల్ని సజెస్ట్ చేయడంలో ఆయన ముందు ఉంటారు. అలాంటి ఐడియాల కోసం పెట్టుబడిదారులు కూడా ఎదురు చూస్తూంటారు.
చంద్రబాబు సీఎంగా ఉంటే ఓ భరోసా
చాలా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలంటే.. పెడితే పెట్టండి లేకపోతే పోండి అన్నట్లుగా ఉంటారు. తమ రాష్ట్రంలో పరిశ్రమ పెడితే తమ వారికి ఉపాధి లభిస్తుందని.. తమ ప్రాంతానికి మేలు జరుగుతుందని అనుకోరు. అందుకే అనుమతులు ఇతర విషయాల్లో సతాయిస్తూ ఉంటారు.కానీ చంద్రబాబు అలా అనుకోరు. పరిశ్రమ ఒప్పందం నుంచి గ్రౌండ్ అయ్యే వరకూ ఆయన అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. కియా పరిశ్రమ విషయంలో చంద్రబాబు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ.. ఆ కంపెనీ యాజమాన్యాన్ని ఫిదా చేసింది. కానీ తర్వాత చంద్రబాబు ఓడిపోవడంతో అనుబంధ కంపెనీలు.. తమిళనాడు, కర్ణాటకకు వెళ్లాయి. ఓ గొప్ప సహకారం తర్వాత మరో దారుణమైన బెదిరింపులు రావడంతో అనేక మంది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది.
చంద్రబాబు కు తోడు ఇప్పుడు లోకేష్
తండ్రికి మించిన తనయుడిగా ఎదుగుతున్న నారా లోకేష్ కూడా ఇప్పుడు ఇన్వెస్టర్లతో అదే స్థాయిలో సంబంధాలను పెంచుకుంటున్నారు. కేవలం వారసత్వంగా కాకుండా.. తాను కూడా అభివృద్ధి రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ ను అవ్వాలని అనుకుంటున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. టీసీఎస్ చైర్మన్ లాంటి వారిని కూడా నారా లోకేష్ నేరుగా కలిసి డీల్ చేస్తున్నారు. అందుకే పెట్టుబడిదారుల సదస్సు ఇంత భారీ విజయం సాధిస్తోంది.


