భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గట్టి షాక్ తగిలింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శా కేసులో అభియోగం నమోదుకు గవర్నర్ ఆమోదం ఇచ్చారు. దీంతో త్వరలోనే కేటీఆర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది.
2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో మొదటిసారి ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహించారు. ఇది హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నిధులతో జరిగింది. రేసు కంపెనీకి రూ.55 కోట్లు చెల్లించారు. ఈ నిధులు మంత్రివర్గ ఆమోదం లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీలో బదిలీ చేశారని ఆరోపణ. రేసు రెండో దశ జరగకపోయినా పూర్తి చెల్లింపులు జరిగాయి. ఇది ‘క్విడ్ ప్రో కో’ అని.. భారత్ రాష్ట్ర సమితి కు రూ.40-44 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ప్రయోజనాలు చేకూర్చారని ఏసీబీ ఆరోపిస్తోంది.
2024 డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి ముందు గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చారు. 9 నెలల విచారణ తర్వాత 2025 సెప్టెంబర్‌లో పూర్తి నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. ఏసీబీ 9 నెలలుగా విచారణ జరిపింది. కేటీఆర్‌ను నాలుగు సార్లు విచారించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ED) కూడా మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేస్తోంది. కేటీఆర్, అరవింద్, బీఎల్ఎన్ రెడ్డిలను ED ప్రశ్నించింది. రెండు మూడు నెలల కిందటే.. ప్రాసిక్యూషన్ కు అనుమతి కోసం గవర్నర్ కు ఏసీబీ లేఖ రాసింది.
జూబ్లిహిల్స్ ఎన్నికల సమయంలో.. గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడానికి బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కే కారణం అని రేవంత్ ఆరోపించారు. లేకపోతే అరెస్టు చేసి ఉండేవారమన్నారు. మరి ఇప్పుడు.. అనుమతి వచ్చింది. కేటీఆర్ ను అరెస్టు చేస్తారా?


