ఆదిభట్ల ఇప్పుడు హాట్ ప్రాపర్టీ అవుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఎవరూ పట్టించుకోనట్లుగా ఉండేది.కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ హాట్ ప్రాపర్టీ అయింది. ఈ ప్రాంతం IT, ఫార్మా, మాన్యుఫాక్చరింగ్లో హబ్‌గా మారింది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ Q3లో 13-19% ధరల పెరుగుదల చూపింది. ఆదిభట్లలో కమర్షియల్ లీజింగ్ 20 శాతం పెరిగింది. రెసిడెన్షియల్లో, HMDA అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్లు రూ. 20-40 లక్షలు, అపార్ట్మెంట్లు రూ. 50 లక్షలు-1 కోటి ఇళ్లకూ డిమాండ్ ఉంది. 2024లో, ఆదిభట్లలో 5,000+ ప్లాట్లు రిజిస్టర్ అయ్యాయి, ఇది 2020 కంటే 40% ఎక్కువ.
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, HMDA మాస్టర్ ప్లాన్ 2050లో ఆదిబట్లను శాటిలైట్ టౌన్‌షిప్‌గా మార్చుతున్నాయి. 1 లక్ష జనాభా, 20,000 రెసిడెన్షియల్ యూనిట్లు .. సెజ్‌తో AI/డ్రోన్ టెక్ హబ్‌గా మారుతుంది. ఆదిభట్ల 2035 నాటికి హైదరాబాద్‌లోని ‘సౌతర్న్ గేట్‌వే’ – SEZ, మెట్రోతో లాండ్ వాల్యూ 3X అవుతుంది,” అని రియల్ ఎస్టేట్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. “ఓపెన్ ప్లాట్లు ఇప్పుడు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ – 10 సంవత్సరాల్లో 200% రిటర్న్స్.” వచ్చే అవకాశం ఉంది.
ఆదిబట్ల పదేళ్ల తర్వాత ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారి, రియల్ ఎస్టేట్‌ను ‘గోల్డ్ మైన్’గా మార్చుతుంది. ఇన్వెస్టర్లు, హోమ్బైయర్లు ఇప్పుడే ఫోకస్ చేస్తే, ఫ్యూచర్ సెక్యూర్ అనుకోవచ్చు.


