జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి చాలా సేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గుర్రప్పందాలు నిర్వహించే సర్జ్ స్టేబుల్ అనే కంపెనీకి చెందిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేటీఆర్, జగన్ ఇద్దరూ కలిసి గుర్రాల ఆకారంలో ఉన్న మెమెంటోలను యువ రైడర్లకు పంపిణీ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
“సర్జ్ స్టేబుల్” యువ రైడర్లు, గుర్రాలను ట్రైనింగ్ ఇచ్చి, షో జంపింగ్, డ్రెసేజ్ వంటి అంతర్జాతీయ స్థాయి పోటీలకు తయారు చేసేలా పని చేస్తుంది. ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ ఇండియాలో రేర్. అయితే ధనవంతుల ఆటగా గుర్తింపు ఉంది.ఈ కార్యక్రమానికి ఇద్దరు నేతల్ని పిలవడం యాధృచ్చికమో లేకపోతే ఆ కంపెనీ ఓనర్ రెండు పార్టీలకు సన్నిహితుడు అయి ఉంటారని భావిస్తున్నారు.
చాలా రోజుల తర్వాత జగన్, కేటీఆర్ బహిరంగంగా కలుసుకున్నారు. అది కూడా ప్రైవేటు కార్యక్రమంలో. జూబ్లిహిల్స్ ఎన్నికల కోసం కేటీఆర్ నారా లోకేష్ ను కలిశారన్న ప్రచారం జరిగింది. కానీ ఖండించలేదు. అయితే భేటీ జరిగే ఉంటుందని అనుకుంటున్నారు. ఇప్పుడు అనూహ్యంగా జగన్, కేటీఆర్ మధ్య భేటీ జరిగింది. ఈ వీడియోలు వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్నాయి.