జగన్ హయాంలో అశాస్త్రీయంగా చేసిన జిల్లాల విభజను సరి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందు కోసం కమిటీలను నియమించారు. కానీ ఇది లేనిపోని సమస్యలను తెచ్చుకోవడం అన్నట్లుగానే సాగుతోంది. జిల్లాలను పునరుద్ధరణ వ్యవస్థీకరించడం, కొత్త జిల్లాలు, పేరు మార్పులపై కొత్తగా వస్తున్న డిమాండ్లు, వివాదాలు రాజకీయ, సామాజిక చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.
చంద్రబాబు మార్కాపురం నుంచి జిల్లా కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ప్ర దర్శి, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి. అన్నమయ్య జిల్లాలో మదనపల్లెకు పుంగనూరు, పిలేరు, తంబల్లపల్లె మండలాలు చేర్చాలని ప్రతిపాదన ఉంది. ఆదివాసీ ప్రాంతాల్లో రంపచోడవరం, చింతూరు మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. పోలవరం ముంపు ప్రాంతాలన్నింటితో ఓ జిల్లా ఏర్పాటు చేస్తామని గతంలో టీడీపీ హామీ ఇచ్చారు.
ఒక అసెంబ్లీ నియోడకవర్గం ఒకే జిల్లాలో ఉండాలని, హెడ్క్వార్టర్లకు 125 కి.మీ. దూరం లేకుండా చూడాలన్న సూచనలు ఉన్నాయి. నూజివీడును ఏలూరు జిల్లా నుంచి ఎన్టీఆర్‌కు మార్చడం.. కైకలూరును కృష్ణా జిల్లాలో కలపడం, గూడూరును నెల్లూరుకు మార్చచడం, పెనమలూరు, గన్నవరంలను కృష్ణా నుంచి ఎన్టీఆర్‌కి మార్చడం వంటి సూచనలు ఉన్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. విజయవాడలో కలిసిపోయిన పెనుమలూరు జిల్లాకేంద్రం మచిలీపట్నంలో ఉండటం ఏమిటన్న ప్రశ్న వస్తోంది.
పేర్ల మార్పు పైనా ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఏ పేర్లు పెడతారన్నదానిపై అనేక వదంతులు వచ్చాయి. ఏదీ ఫైనల్ కాలేదు. కానీ ఈ విషయాల్లో ఎంతగా నాన్చితే.. ఎంతగా ప్రచారం జరిగితే అన్ని డిమాండ్లు పుట్టుకు వస్తాయి. రె వెన్యూ శాఖ రిపోర్ట్‌ను ముఖ్యమంత్రికి సమర్పించనుంది. క్యాబినెట్ సమావేశంలో చర్చించి, డిసెంబర్‌లోపు జీఓలు జారీ చేస్తారు. ప్రజావేదికలు, డేటా ఆధారంగా ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని మంత్రులు హామీ ఇస్తున్నారు.
కానీ ఇక్కడ అసలైన సమస్య ఉంది. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్లుగా విభజన చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే, పరిపాలన సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది కానీ, రాజకీయ వివాదాలు, ప్రాంతీయ డిమాండ్లు పెరిగితే, మరిన్ని సవాళ్లు ఎదురవుతాయి.