ఆంధ్రప్రదేశ్ టైర్-2 సిటీల్లో రియల్ ఎస్టేట్ దూకుడు మీద ఉంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రెవెన్యూ ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లోనే 46 శాతం పెరిగింది. ఆ తరవాత కూడా ఆ జోరు కనిపిస్తోంది. విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి – ఈ ఏడు సిటీలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు ఫేవరెట్ అయిపోయాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సిటీల్లో గత ఏడాది నుంచి భూమి ధరలు 8 నుంచి 15 శాతం వరకు పెరిగాయి. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అమెరికా-దుబాయ్ నుంచి NRIలు ఈ టైర్-2 సిటీల్లో భూములు, ఫ్లాట్లపై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్పుడు కొంటే తక్కువ రిస్క్, ఎక్కువ లాభం. 2025-2027 మధ్య ఏపీ టైర్-2 సిటీల్లోనే అతి పెద్ద బూమ్ వస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
ఈ బూమ్‌కు ప్రధాన కారణం ఇన్వెస్ట్ మెంట్స్ అనుకోవచ్చు. ప్రతి జిల్లాలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రకటనలు వస్తున్నాయి. ఇవన్నీ గ్రౌండింగ్ అయిన తర్వాత మరిన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ప్రభుత్వంపై నమ్మకంతో ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతున్నారు. అవే పెట్టుబడులపై నమ్మకంతో రియల్ ఎస్టేట్ పెరుగుతోంది.
