ఐబొమ్మ రవిను పకడ్బందీగా అరెస్టు చేశారు. ఆయన అకౌంట్లో కోట్లు ఫ్రీజ్ చేశారు. కానీ ఆయనకు వ్యతిరేకంాగ నేరం చేశారన్నదానికి సరైన సాక్ష్యాలను పోలీసులు గుర్తించలేకపోయినట్లుగా తెలుస్తోంది.కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినా పోలీసులు ఎప్పటికప్పుడు మీడియాకు పాత విషయాలే లీకులు ఇచ్చారు. పౌరసత్వం, సర్వర్లు ఇలా చెప్పిన విషయాలే చెప్పారు కానీ.. అసలు ఆయనే నేరం చేశాడన్న దానికి ఆధారాలు ఉన్నాయా అన్నదానికి క్లారిటీ రాలేదు.
రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఫుడ్ యాప్స్ తప్ప ఇంకేమీ లేవని చెబుతున్నారు. పైరసీ చేస్తే ఎంత శిక్ష పడుతుంది.. పైరసీ చేసిన వాళ్లుఎవరు.. అప్ లోడ్ చేసింది ఎవరు..ఇవన్నీ టెక్నికల్ నేరాలు. ఎలా నిరూపిస్తారో ఇంకా స్ఫష్టత రాలేదు. అందుకే బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేశారని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. పైరసీ కన్నా బెట్టింగ్ సైట్ల ప్రమోషనే ఎక్కువ సమస్య ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.
అంతకు మించి రవి ఇప్పుడు ఇండియన్ సిటిజన్ కాదు. ఆయన పౌరసత్వం వదులుకున్నాడు. కరీబియన్ దీవుల్లో సెయింట్ కీట్స్ పౌరుడు. అందుకే ఆయనను జైల్లో పెట్టే విషయంలోనూ కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. పోలీసులను సవాల్ చేశారన్న కసితో రవిని పట్టుకోగలిగారు.. కానీ ఆయనను జైల్లో ఎంత కాలం ఉంచగలరన్నది కూడా ఆసక్తికరమైన అంశంగా మారింది. ప్రస్తుతం అయితే పోలీసుల వైపు నుంచి వస్తున్న లీకులు.. కేసు తేలిపోతుందన్నట్లుగా ఉంటున్నాయి.
