జగన్ రెడ్డి ఎప్పుడేం మాట్లాడినా అంతా రొటీన్. కొత్త విషయాలు చెప్పరు.. పాత విషయాలను కొత్తగా చెప్పరు. అందుకే మీడియా, సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడైనా మీడియా ముందుకు వస్తారో ఆయనేం మాట్లాడతారో కూడా అందరిూ ఊహించేసుకుంటారు.పెద్దగా ఆసక్తి లేకుండా పోవడంతో.. స్కిట్ డైరక్టర్లు కొత్త రూట్ కనిపెట్టారు. అదేమిటంటే జగన్ పక్కనే ఆర్టిస్టుల్ని పెట్టి డైలాగులు వినిపించడం.
పులివెందుల నియోజకవర్గంలో ఒక ఊరిలో అరటి పంటను పరిశీలించడానికి వెళ్లారు. అక్కడ ఎప్పటిలాగే.. ఏ టూ జడ్ ప్రసంగం ఇచ్చారు. చివరికి మెడికల్ కాలేజీల గురించీ మాట్లాడారు. అంతా రొటీన్ గా ఉంది. అయితే పక్కన రైతు పేరుతో ఒకర్ని తీసుకొచ్చి చంద్రబాబును తిట్టించారు. చంద్రబాబు వ్యవసాయం దండగన్నట్లుగా రైతు పేరుతో ఆ వ్యక్తి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి జగన్ ను సంతృప్తి పరిచారు.
జగన్ సీఎంగా ఉన్నప్పుడు అరటి క్వింటాల్ కు 30వేలు వచ్చాయట. రైతులు అంత వస్తే.. ఇక వియోగదారులు డజన్ అరటి పళ్లు వెయ్యి పెట్టి కొని ఉంటారు. ఎందుకంటే అవి ఖచ్చితంగా రెండు కేజీలు ఉంటాయి. అలాగే మార్కెట్ లేకపోతే ఢిల్లీకి ఇతర చోట్లకు రైళ్లలో పంపించారట. కరోనా సమయంలో కేంద్రం కిసాన్ రైళ్లను పెట్టింది. దాన్ని జగన్ తాను పెట్టినట్లుగా చెప్పుకుని డబ్బా కొట్టుకున్నారు.
రైతులు ఎంతో నష్టపోతే..తన సొంత నియోజకవర్గ రైతులకు ఏమైనా సాయం చేశారా అంటే.. అలాంటిదేమీ లేదు. చంద్రబాబును తిట్టడానికి, తిట్టించడానికి మాత్రం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు.