జీవిత చరమాంకానికి వచ్చాక.. తమ జీవితంలో ఈ స్థితికి రావడానికి కారణమైన వాళ్లపట్ల కృతజ్ఞతగా ఉండటం, వారు చేసిన సాయాన్ని బయటకు చెప్పుకోకపోయినా కనీసం తప్పుగా మాట్లాడకుండా ఉండటం సామాన్యమైన మానవుల లక్షణం. అదేం విచిత్రమో కానీ జగన్ రెడ్డి పంచన చేరితే ఎవరైనా తమ ఆత్మలను కూడా అమ్మేసుకుని జగన్ రెడ్డిని మానసికంగా తృప్తి పరచాల్సిందే. దానికి కొమ్మినేనే సాక్ష్యం.
కొమ్మినేని అనే వాడు ఈ రోజు జర్నలిస్టుగా ఉన్నాడంటే దానికి కారణం ఈనాడు, రామోజీరావు, ఆ సంస్థలో ఆయన ఎంత కీలక బాధ్యతలు నిర్వహించారో.. అలాంటి అవకాశాలు ఎన్ని కల్పించారో .. సీనియర్ జర్నలిస్టులందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అదే ఈనాడు మీద, చనిపోయిన రామోజీరావు మీద ఏ మాత్రం సిగ్గుపడకుండా నిందలేస్తున్నారు కొమ్మినేని. అది కూడా తాను పని చేసిన కాలం నాటి మీడియా విధానాలపై కూడా.
రామోజీరావు పేరుతో అవార్డులు ఇస్తూ ఓ కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించారు. ఆ సందర్భంలో రామోజీరావు పాటించే విలువల గురించి చంద్రబాబు చెప్పారు. ఆయన అడిగితే ఎలాంటి పని అయినా చేసేవారుంటారు కానీ ఒక్కపని కూడా ఆయన ఎప్పుడూ అడగలేదన్నారు. రేవంత్ కూడా అదే చెప్పారు. వెంటనే కొమ్మినేనికి రామోజీకి వ్యతిరేకంగా ఓ ఎడిటోరియల్ రాసేయమని సజ్జల చెప్పాడో లేకపోతే.. ఆయనకే అనిపించిందో కానీ రాసేశారు. ఆ వ్యాసం మొత్తం ఆత్మవంచనే.
కొమ్మినేని చర్చా కార్యక్రమాలు చూసేవారికి.. ఆయన జర్నలిస్టు అని ఎవరూ నమ్మలేరు. కానీ ఆయన ఈనాడులో ఎన్నో గొప్ప కథనాలు రాశారు. అందుకే ఈ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు సాక్షిలో చేరి ఆత్మవంచన చేసుకుని.. నెలకు ఇచ్చే.. రెండు,మూడు లక్షల కోసం కక్కుర్తి పడి తన ఆత్మను అమ్మేసుకుంటున్నారు. ఆయననను ఏమీ అనలేరు.. పాపం..కొమ్మినేని అని అనుకోవడం తప్ప.