నారా లోకేష్ ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారని సాక్షి పత్రికలో విపరీతంగా బాధపడుతూ కథనాలు రాస్తున్నారు. లోకేష్ తన మంత్రి పదవీ బాధ్యతలను నిర్వర్తించేందుకే వెళ్తున్నారు. అయినా సరే ఆయన సొంత డబ్బులతో వెళ్తున్నారు. ఈ విషయం అధికారికంగా నిరూపితమయింది.
నారా లోకేష్ 77 సార్లు ప్రత్యేక విమానంలో తిరుగుతూ, హైదరాబాదులో సేదతీరుతూ ఉన్నారని సాక్షిలో వేసినవి పచ్చి అబద్ధాలని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఇందులో ఒక్కటి కూడా వ్యక్తిగత పర్యటన లేదు, అయినప్పటికీ ఈ పర్యటనలకు సొంత సొమ్మును మంత్రి నారా లోకేష్ వెచ్చిస్తున్నారు. ఈ పర్యటనల కోసం తాను నిర్వహించే మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల నుంచి ఒక్క రూపాయి కూడా మంత్రి నారా లోకేష్ తీసుకోలేదని సమాచార హక్కు ఉద్యమ కార్యకర్త వేసిన అర్జీ ద్వారా వెల్లడైంది. దీంతో సాక్షి పరువుపోయింది. నిజానికి సాక్షిలో వచ్చే వార్తల్లో నిజమైన వార్తలు తీసేస్తే ఆ పత్రికలో వార్తలే ఉండవు.
ఇప్పుడు జగన్ రెడ్డి .. సీఎంగా ఉన్నప్పుడు తన వ్యక్తిగత పర్యటనల కోసం హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలు అద్దెకు తీసుకున్నారు. వాటికి ప్రజాధనమే వాడారు కానీ సొంత డబ్బులు వాడలేదు. జగన్ వేరే ప్రాంతానికి వెళ్తూంటే.. సతీమణిని హైదరాబాద్ లో డ్రాప్ చేయడానికి వయా హైదరాబాద్ వెళ్లేవారు. అంత ఘోరంగా సిటీ బస్సుల్లా విమానాలు వాడేవారు. ప్రజాధనమే పెట్టేవారు. అంత ఎందుకు..సొంత ఇంటికి క్యాంపు ఆఫీసు పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. కిటికీలను కూడా ప్రజాధనంతోనే పెట్టించుకున్నారు. వారు .. ప్రజాధనం పట్ల బాధ్యతగా ఉండే లోకేష్, చంద్రబాబుపై తప్పుడు ప్రచారాలతో బురద చల్లుతున్నారు. ఇప్పటికే లోకేష్ కొన్ని అంశాల్లో కోర్టుకెళ్లారు. సాక్షి యాజమాన్యం సమాధాన చెప్పుకోలేకపోతోంది. అయినా తప్పుడు ప్రచారాలు మాత్రం ఆపడం లేదు.