మధ్య తరగతి వారిని సొంత ఇంటి యజమానులను చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని 2015లో ప్రారంభించింది. దీని ముఖ్య లక్ష్యం ‘హౌసింగ్ ఫర్ ఆల్.’ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఆర్థికంగా బలహీన కుటుంబానికీ పక్కా ఇల్లు అందించడం లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల కోసం PMAY-Urban, గ్రామీణ ప్రాంతాల కోసం PMAY-Gramin రెండింటినీ 2024–25లో కొత్త రూపంలో అప్‌గ్రేడ్ చేసి PMAY-U 2.0, PMAY-G 2.0గా మార్చారు.
పట్టణ ప్రాంతాల్లో ఇంకా ఇల్లు లేని లేదా కూలిపోయే స్థితిలో ఉన్న గృహాల్లో ఉంటున్న లక్షలాది కుటుంబాల కోసం PMAY-U 2.0 ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రెండో దశలో మరో ఒక కోటి కొత్త కుటుంబాలకు ఇళ్లు కట్టే లక్ష్యం పెట్టారు. ఇందుకోసం 2025 బడ్జెట్లో దాదాపు రూ.10 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. ఇంటి నిర్మాణం కోసం నేరుగా డబ్బు ఇవ్వడం , బ్యాంకు హోమ్‌లోన్‌పై వడ్డీ సబ్సిడీ , డెవలపర్లతో కలిసి అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులు వంటి మూడు నాలుగు మార్గాల ద్వారా సహాయం అందుతుంది.
ఆర్థికంగా బలహీన వర్గం , తక్కువ ఆదాయ వర్గం , మధ్య తరగతి వర్గాలకు లబ్ది కలుగుతుంది. ఈ ఏడాది కొత్తగా మధ్యతరగతి వారికి కూడా ఎక్కువ సబ్సిడీ, ఎక్కువ లోన్ పరిమితి ఇస్తూ నిబంధనలు సడలించారు. ఉదాహరణకు రూ.12 లక్షల వరకు హోమ్‌లోన్ తీసుకుంటే 6.5 శాతం వడ్డీ సబ్సిడీ ద్వారా రూ.2.67 లక్షల వరకు మీ జేబులోనే మిగులుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో PMAY-Gramin 2.0 ఇంకా శక్తివంతంగా అమలవుతోంది. ఇక్కడ ఒక్కో ఇంటికి రూ.2.67 లక్షల నుంచి రూ.2.89 లక్షల వరకు నేరుగా ఇస్తారు. ఇల్లు మహిళ పేరిట ఉండాలనే నిబంధన కొనసాగుతోంది. ఆగిపోయిన ఫ్లాట్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా SWAMIH ఫండ్‌ను రూ.15,000 కోట్లతో బలోపేతం చేసింది. 2025 డిసెంబర్ 31 లోపు దరఖాస్తు చేసుకుంటే ఈ అద్భుతమైన సబ్సిడీలు, రాయితీలు పొందే చివరి అవకాశం. మీరు ఇంకా దరఖాస్తు చేయకపోతే వెంటనే pmay-urban.gov.in లేదా pmayg.nic.in వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు.