సీనియర్ IPS అధికారి సంజయ్ సప్సెన్షన్ మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్ సస్పెన్షన్ కు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులు నెలాఖరు వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత కూడా ఆయన సస్పెన్షన్ ను కొనసాగించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు సంజయ్ సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులుఇచ్చారు.
ఫైర్ సర్వీసెస్ DG గా ఉన్న సమయంలో అవకతవకలు జరిగాయి అని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఏసీబీ విచారణకు ఆదేశించింది. అందులో ఆయన అవినీతికి పాల్పడ్డారని తేలడంతో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన ఇదే కేసులో అరెస్ట్ ఆ అయి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. దాదాపుగా మూడు నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. మూడు సార్లు దిగువ కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. అయితే హైకోర్టుకు వెళ్లకుండా ఆయన జైల్లోనే ఉన్నారు.
తొంభై రోజులు అయ్యాక మరోసారి బెయిల్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఆయన సర్వీస్ 2027 వరకూ ఉంది. అప్పటి వరకూ ఆయనకు పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు లేవు. జగన్ హయాంలో ఆయన అన్ని రకాల సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి .. రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడారు. మార్గదర్శి వంటి సంస్థను తప్పుడు కేసులో పతనం చేయాలని చూశారు. అయితే ఆ కేసులు ఇంకా తెరపైకి రాలేదు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల్లో ప్రెస్మీట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేశారు. కోర్టులో మాత్రం నిరూపించలేకపోయారు.