సోషియో ఫాంటసీ మంచి గిరాకీ వున్న జానర్. చిన్న సినిమాలు కూడా ఈ తరహ కథలని ప్రయత్నిస్తున్నాయి. అవినాశ్ తిరువీధుల హీరోగా దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న చిత్రం ‘వానర’. సిమ్రాన్ చౌదరి కథానాయిక. నందు విలన్ రోల్ చేశాడు. సోషియో ఫాంటసీ జానర్ సినిమా ఇది. తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు.
”అసలు వానరులు అంటే ఎవరు? ఆకతాయిలు, తెలివైన వారు.. మంచి కంత్రిగాళ్లు. వీళ్ళకి నచ్చిన వాటిని ఎవరైనా ఎత్తుకెళ్తే మాత్రం.. దాని కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఆఖరికి అది ఎత్తుకెళ్లింది రావణాసురుడు అయినా సరే.. లంకని తగలబెట్టేస్తారు” విశ్వక్ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ లో వానర కథని చెప్పే ప్రయత్నం చేశారు. వానర టైటిల్, రావణాసురుడు రిఫరెన్స్, చివర్లో హనుమంతును పూనకం.. ఇవన్నీ సోషియో ఫాంటసీ జానర్ ని టచ్ చేశాయి.
ఇష్టమైన బైక్ ని ఎత్తుకెళ్ళడంతో ఈ కథంతా జరిగినట్లు టీజర్ చూపించారు. అయితే అసలు పాయింట్ ఇంకేదో వుంది. ఇందులో పొలిటికల్ కోణం కూడా వుంది. అవినాశ్ చలాకీగా కనిపించారు. నందు విలన్ గా కొత్తగా కనిపించాడు. పృథ్వీ, కోన వెంకట్, సత్య, శివాజీరాజా లాంటి ప్రముఖ తారాగణం వుంది. టీజర్ లో వివేక్ సాగర్ సౌండింగ్ బావుంది. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకి మాటలు రాయడం విశేషం. త్వరలోనే సినిమాని ప్రేక్షకులుముందుకు తీసుకొస్తున్నారు.