పోలీసుల వద్ద ఉండాల్సిన కేసు డైరీ, సాక్షుల స్టేట్మెంట్లను అక్రమంగా సేకరించడమే నేరం..దాన్ని తీసుకెళ్లి కోర్టులో సాక్ష్యంగా ప్రవేశ పెట్టాలి అనే తెలివి తేటలు సహజంగా లాయర్లకు రావు. సమాచారం తెలుసుకుని దానికి తగ్గట్లుగా ప్లాన్ చేసుకుంటారు. కానీ పొన్నవోలు లాంటి మాస్టర్ క్లాస్ లాయర్లు అయితే మాత్రం అవి నేరుగా కోర్టుకు సబ్ మిట్ చేసి.. చట్టానికి, న్యాయానికి జరిగిన ఈ సమరంలో అని పాటందుకుంటారు. పిన్నెల్లి లాయర్లకు పొన్నవోలు సలహాలు ఉన్నాయోమో కానీ అచ్చంగా ఇదే చేశారు.
టీడీపీ కార్యకర్తల హత్య కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం పోరాడుతున్నారు. గతంలో సుప్రీంకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. అందుకే జైలుకు వెళ్లలేదు. ఇప్పుడు పూర్తి స్థాయి ముందస్తు బెయిల్ కోసం విచారణ జరిగింది. పిన్నెల్లి తరపు లాయర్లు తమ వాదనకు మద్దతుగా కేసు డైరీ, సాక్షుల స్టేట్మెంట్లను కోర్టుకు సమర్పించారు. వీటిని చూసి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా షాక్కు గురయింది. ఇవి మీకు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తే పిన్నెల్లి లాయర్ల వద్ద సమాధానం లేదు. మీరు ఇంత పలుకుబడిగలవారా అని ఆశ్చర్యపోయి.. వెంటనే ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసి..రెండు వారాల్లో లొంగిపోవలాని ఆదేశించింది
ఇది రాజకీయకక్ష సాధింపుల కేసు అని వాదించేదుకు పిన్నెల్లి లాయర్లు ప్రయత్నించారు. అలా అయితే.. లోపలికి వెళ్లిరండి అని ధర్మాసనం ఘాటుగా స్పందించింది. పిన్నెల్లి బ్రదర్స్ ఇప్పుడు తమ లాయర్ల వైపు ఎలా కొరకొరగా చూసినా ప్రయోజనం లేదు. నిజానికి ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టే రక్షణ ఇచ్చింది. ఈ తప్పుడు పని చేయకపోతే ముందస్తు బెయిల్ లభించి ఉండేది. కానీ పొన్నవోలు సలహా ఇచ్చాడో.. లేకపోతే తమకు పలుకుబడి ఉందని చూపించాలనుకున్నారో కానీ చిక్కుకుపోయారు. వాళ్లు ఈ కేసులో బయటకెళ్తే మళ్లీ ఎప్పటికి బయటకు వస్తారో చెప్పడం కష్టమే.