దిల్‌రాజు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. హిందీలో వరుసగా సినిమాల్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ – అనీస్ బాజ్మీ కలయికలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని.. 2026లోనే చిత్రీకరణ ప్రారంభించి, విడుదల చేస్తామని చెప్పారు. అలాగే సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి కలయికలో ఓ చిత్రం నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
దిల్ రాజుని ఆర్ధికంగా నిలబెట్టిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. గేమ్ చెంజర్ లాంటి బిగ్ డిస్సాపాయింట్మెంట్ నుంచి దిల్ రాజుని బయటపడేసిన సినిమా ఇది. ఎవరూ ఊహించని వసూళ్ళు రాబట్టింది. సంక్రాంతి సీజన్ మొత్తాన్ని సోలోగా క్యాష్ చేసుకుంది. ఇప్పుడీ సినిమాని బాలీవుడ్ లోకి తీసుకెళ్తున్నారు. అక్షయ్ కుమార్ కి కామెడీ ఇమేజ్ కూడా వుంది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అక్షయ్ మీద వర్క్ అవుట్ అవుతాయి.
కాకపోతే.. సంక్రాంతికి వస్తున్నాం డైలాగ్ కి ప్రాధాన్యత వున్న సినిమా. హిందీ నేగిటివికి తగ్గట్టు డైలాగ్ మార్చుకుని అక్కడ ఫన్ ని పడించగలిగితే ఈ కథకి తిరుగుండదు. పైగా ఈ రిమేక్ కోసం అనీస్ బాజ్మీని ఎంచుకున్నారు. ఆయన మంచి ఫన్ టచ్ వున్న దర్శకుడు. నో ఎంట్రీ, వెల్కమ్, సింగ్ ఈజ్ కింగ్, భూల్ భూలయ్యా లాంటి వినోదాత్మక సినిమాలు తీశారు. మొత్తానికి దిల్ రాజు మంచి కాంబినేషన్ సెట్ చేశారు.
