రాజీనామాలు ఆమోదించకుండా ఆలస్యం చేసి వైసీపీ ఒక ఎమ్మెల్సీ మనసు మార్చగలిగింది. అన్నమయ్య జిల్లాకు చెందిన మండలి చైర్మన్ జకియా ఖానం చేసిన రాజీనామాను ఉపసంహరించుకునేలా చేయగలిగారు. హైకోర్టు ఆదేశాలతో మండలి చైర్మన్ రాజీనామాలపై విచారణ చేపట్టారు. ఆ విచారణలో జకియా ఖానం తాను రాజీనాామా ఉపసంహరించుకుంటానని తెలిపారు. దాంతో స్పీకర్ అంగీకరించి.. ఆమె రాజీనామాను తిరస్కరించారు.
నిజానికి ఆమె బీజేపీలో చేరిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు నారా లోకేష్ తో సమావేశమయ్యారు. కానీ ఆమెను చేర్చుకోవడానికి కడప నేతలు ఆసక్తి చూపించలేదు. దాంతో ఆమె బీజేపీలో చేరిపోయారు. పురందేశ్వరి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు బీజేపీ కండువా కప్పించుకున్నారు.కానీ ఇప్పుడు మాత్రం రాజీనామా ఉపసంహరించుకున్నారు. అంటే బీజేపీని వదిలి వైసీపీలో కొనసాగుతున్నట్లే. బీజేపీలో చేరినట్లయితే ఆమెపై అనర్హతా వేటు వేయవచ్చు.
ఇంతా చేసి ఆమె పదవి కాలం వచ్చే ఏడాది జూలై వరకే ఉంది. అంటే మరో ఏడు నెలలు మాత్రమs ఉంది. ఒక వేళ ఆమె రాజీనామా ఆమోదించినా ఉపఎన్నిక మాత్రం రాదు. అందుకే ఆమె ఈ ఏడు నెలలు పదవిలో ఉండటం మంచిదనుకున్నారు. గతంలో తిరుమలలో సిఫారసు దర్శన టిక్కెట్లను అమ్మకుంటూ ఆమె పీఏ దొరికారు. మరో వైపు బీజేపీలో చేరిన మరో ఎమ్మెల్సీ పోతుల సునీత విచారణకు హాజరు కాలేదు. ఆమె కూడా బీజేపీలో చేరారు. అయితే ఆమె రాజీనామాకు కట్టుబడి ఉంటారని చెబుతున్నారు.