నార్సింగి, నానక్ రామ్ గూడలో పదేళ్ల కిందట ఇళ్లుకొన్న వారు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందని సంతోషపడ్డారు. ఇప్పుడు అక్కడ నివాసం ఉండేవారు ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని చేధించుకుని ఇళ్లకు, ఆఫీసుకు పోవాల్సి వస్తోంది. ఇప్పుడు కోకాపేట వైపు వెళ్తున్న మార్కెట్ .. రానున్న రోజుల్లో ఇంత కన్నా ఘోరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు నిర్మిస్తున్న ఇళ్లకు నో ఫ్లోర్ ఇండెక్స్ విధానంతో ఎన్ని అంతస్తులు కావాలంటేఅన్ని కట్టుకుంటున్నారు. యాభై అంతస్తులు మినిమం ఉంటున్నాయి. ప్రతి ఇంట్లోనూ రెండు, మూడు కార్లు ఉంటాయి. ప్రస్తుతం కోకాపేట ఆ చుట్టుపక్కల నిర్మాణంలో ఉన్న ఆకాశహర్మాలు చివరి దశకు వచ్చినవి కొన్ని ఉన్నాయి. ప్రారంభమైనవికొన్ని ఉన్నాయి. కానీ వచ్చే నాలుగైదేళ్లలో అన్నీ కంప్లీట్ అవుతాయి. ఆక్యుపై చేసుకుంటారు. అప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం.
అత్యంత బిజీ ట్రాఫిక్ ఏరియాల్లో ఒకటిగా నార్సింగి, నానక్ రామ్ గూడ, కోకాపేట నిలుస్తాయి. రోడ్లు ఎంత విశాలంగా ఉన్నా సరే.. అక్కడ జన సాంద్రత ఎవరూ ఊహించని విధంగా పెరుగుతుంది. చాలా కొద్ది ఏరియాలోనే లక్షల మంది నివరిస్తారు. లక్షల కార్లు , వాహనాలు రోడ్లపైకి వస్తాయి. ఇలాంటి సవాళ్లను అంచనావేసి దానికి తగ్గట్లుగా మౌలిక సదుపాయాలి. కానీ .. ఏదైనా సమస్య వచ్చిన తర్వాత స్పందించడం ప్రభుత్వాల అలవాటు. అందుకే కోకాపేట భవిష్యత్ ట్రాఫిక్ పద్మవ్యూహం కావడం ఖాయమని అనుకోవచ్చు.
