పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత తాను ఫైర్ బ్రాండ్ అని .. తనను ఫైర్ అని చెప్పుకునేందుకు చేసే విచిత్రమైన పనులు చాలా సార్లు ప్రజలకు చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఇటీవలి కాలంలో పదవిని ఎంజాయ్ చేస్తున్న ఆమె.. కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తున్నదేమీ లేదు. కానీ పార్లమెంట్ లో మాత్రం..తాను ఉన్నానని నిరూపించుకునేందుకు తొలి రోజే కుక్కను తీసుకు వచ్చి చర్చ లేపారు. పార్లమెంట్ సభ్యులందర్నీ కుక్కలతో పోల్చి.. తీవ్ర విమర్శల పాలయ్యారు. కాంగ్రెస్ పెద్దలు కూడా రేణుకను సమర్థించలేకపోతున్నారు. ఎందుకంటే .. ఆమె కుక్కలు అన్నవారిలో వారు కూడా ఉండి ఉంటారని అనుకోకుండా ఉండలేరు.
పార్లమెంట్ సభ్యురాలిగా ఉండి పార్లమెంట్‌ను అవమానిస్తారా?
వీధికుక్కల అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి. అయితే అదేదో కేంద్రం..వీధి కుక్కులను హింసిస్తున్నట్లుగా వాటిని తాము రక్షిస్తామని.. అవి కరిచే కుక్కలు కాదని చెప్పడానికి రేణుకా చౌదరి ఈ ప్రయత్నం చేశారు. వీధి కుక్కలు కరుస్తున్నాయో లేదో.. ప్రతి రోజూ ఆస్పత్రులకు వస్తున్న లక్షల మందిని అడిగితే చెబుతారు . అన్నీ కరవకపోవచ్చు కానీ ప్రమాదకరంగా మారాయన్నది మాత్రం అంగీకరించాల్సిన నిజం. దానికి పరిష్కారం వెదకాలి కానీ ఇలా పార్లమెంట్ ను అవిమానించడం మాత్రం .. క్షమించరాని విషయం అన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఎంపీలను పెంపుడు కుక్కలన్నట్లుగా రాహుల్ వ్యాఖ్యలు
ఆ కుక్క ప్రస్తావన వచ్చినప్పుడు రేణుకా చౌదరితో పాటు రాహుల్ గాంధీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలోకి కుక్కను తీసుకువస్తే .. ఇదేమిటని అడిగిన వారికి అది కరవదని.. కరిచేవాళ్లు లోపల ఉన్నారని స్పందించారు. తాను సైటైర్ వేశానని అనుకున్నారు కానీ ఆమె .. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల్ని అవమానించారు. అంటే ప్రజల్నే అవమానించారు. రాహుల్ గాంధీ కూడా ఆమెకు మద్దతుగా మాట్లాడారు. పెంపుడు కుక్కల్ని బయట అనుమతించరు కానీ లోపలికి అనుమతిస్తారని కుళ్లు జోకు వేశారు. అంటే కాంగ్రెస్ ఎంపీలను కూడా ఆయన అన్నట్లే.
రేణుకా చౌదరిపై చర్యలకు రాజ్యసభ రెడీ
పార్లమెంట్ మీద ఏ మాత్రం గౌరవం లేని కాంగ్రెస్ పార్టీ తమకు అధికారం దక్కడం లేదన్న దుగ్ధతో ఎన్నికల ప్రక్రియపైనా అనుమానాలు పెంచే ప్రయత్నం చేస్తోంది . ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ ను అవమానిస్తోంది. పార్లమెంట్ సభ్యులను అవమానిస్తున్నారు ఇలాంటి వారిని ఉపేక్షిస్తే.. రేపు పార్లమెంట్ ను మరింతగా అవమానిస్తారని.. చర్యలు తీసుకోవాలని రాజ్యసభ భావిస్తున్నారు. నేడో రేపో ప్రివిలేజ్ మోషన్ పాస్ చేసి.. పార్లమెంట్ లపై గౌరవం లేని ఆమెకు సభలో ఉండే అర్హతలేదని తేల్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి కూడా మద్దతు రాదు.
